పూజ అనగానే పూలు, పండ్లు, తమలపాకులు, వక్కలు పసుపు, కుంకుమ,అరబత్తులు, కర్పూరం కొబ్బరికాయలను తప్పనిసరిగా తెచ్చిపెడతారు.. అయితే పూజకు తమలపాకులు ఎందుకు పెడతారో ఎప్పుడైనా ఆలోచించారా? దాని వెనుక ప్రత్యేకమైన కథ ఉందని నిపుణులు చెబుతున్నారు.. అసలు చరిత్ర ఏంటో ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం..
ఈ తమలపాకులను లక్ష్మీ స్వరూపంగా భావిస్తున్నారు.. తమలపాకులో ఉన్న స్వభావిక లక్షణాలు భక్తులకు సానుకూల శక్తిని దైవిక ఆశీర్వాదాన్ని ఆకర్షిస్తాయని ప్రజలు నమ్ముతారు. ఆరాధనలో ఏకాగ్రత కలిగిస్తుంది. హిందువులు తమలపాకు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, శివుడిని సూచిస్తాయి. పూజా సమయంలో తమలపాకును సమర్పించడం అనేది దైవిక శక్తుల పట్ల భక్తిని వ్యక్తపరిచే శుభమైనా మార్గం అని ఈ పండితులు చెబుతున్నారు. పారాయణం, పూజల సమయంలో తమలపాకులు, పండ్లు ఉంచి తంబులంగా ఆచారాల ప్రకారం దేవత మూర్తులకు సమర్పిస్తారు…
ఇకపోతే కొన్ని ప్రాంతాల్లో పూజ సమయంలో ఆకు పై కర్పూరం పెట్టి వెలిగిస్తారు… మరో కథ కూడా ఉంది.. రాక్షసులు అమృతం కోసం అమృతాన్ని పొందేందుకు సముద్రం మథనానికి చేసిన సమయంలో దైవిక వస్తువులు ఉద్భవించాయి. వీటిల్లో ఒకటి తమలపాకు అని పండితులు చెబుతున్నారు. ఈ ఆకు ప్రస్తావన మహాభారతం అంటే ఇతిహాసాలలో కూడా ప్రస్తావించబడింది.. అప్పటి నుంచి ఇప్పటివరకు అలా పూజలో ముఖ్యమైనదని పండితులు చెబుతున్నారు.. శుభకార్యాలకు కూడా తాంబూలంగా తమలపాకును వాడుతారు…
