NTV Telugu Site icon

Navaratri : నవరాత్రుల్లో ఈ పనులు అస్సలు చెయ్యకూడదు.. ఎందుకంటే?

Devi Navaratri

Devi Navaratri

భారత దేశ వ్యాప్తంగా దసరా నవరాత్రులు జరుగుతున్నాయి.. తొమ్మిది రోజుల్లో దుర్గాదేవిని తొమ్మిది రూపాలతో పూజిస్తూ ఉంటారు. ఇక శారదీయ నవరాత్రులుగా పిలువబడే ఈ రెండవ నవరాత్రులు ఈ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీన ప్రారంభమయ్యాయి. శరన్నవరాత్రుల్లో ప్రజలు అత్యంత భక్తి నిష్టలతో దుర్గామాతను పూజిస్తారు. రోజుకో అలంకరణతో అమ్మవారికి ఇష్టమైన పుష్పాలతో పూజిస్తారు.. అయితే ఇలాంటి పవిత్రమైన రోజుల్లో కొన్ని పనులు అస్సలు చెయ్యకూడదట.. అవేంటో వివరంగా తెలుసుకుందాం..

నవరాత్రి సమయంలో కచ్చితంగా మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఈ తొమ్మిది రోజులపాటు ఎలాంటి మాంసం కూడా తీసుకోరాదు. నవరాత్రి సమయంలో మాంసం తినకుండా దూరంగా ఉండాలి.. ఇక అమ్మవారిని పూజించేవారు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యంను సమర్పిస్తారు.. ఈ నైవేద్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉల్లి, వెల్లుల్లిని అస్సలు వాడకూడదట.. అమ్మవారికి ఆగ్రహం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి..

నవరాత్రులలో ప్రజలు తరచుగా స్నానం చేశాక గోళ్లను, జుట్టును కత్తిరించుతూ ఉంటారు.కానీ అలా చేయడం అస్సలు మంచిది కాదు. హిందూ మతం ప్రకారం ఉపవాస సమయంలో జుట్టు గానీ గోళ్ళు కానీ కత్తిరించడం వలన అశుభం కలుగుతుంది.. అలాగే ఈ నవరాత్రుల్లో మధ్యపానం, దుమపానం కు దూరంగా ఉండాలి.. ఆహారం వృధా చేస్తూ ఉంటారు. కానీ ఆహారం వృధా చేయడం పాపం.. ఇక నవరాత్రుల్లో బూతులు, అసహ్యకరమైన మాటలు అస్సలు మాట్లాడకండి.. ఎందుకంటే ఈ మాసం చాలా పవిత్రమైనది.. స్త్రీలను అగౌరవపరచకూడదు. ఎందుకంటే నవరాత్రుల తొమ్మిది రోజుల సమయంలో దుర్గాదేవి తొమ్మిది రూపాలను పూజిస్తారు.. అందుకే అమ్మవారి స్వరూపాలైన స్త్రీలను గౌరవించాలి.. ఈ విషయాలను తప్పక గుర్తు పెట్టుకోవాలి..