Site icon NTV Telugu

Monday : శివుడికి ఇలా పూజ చేస్తే చాలు.. మీకు అదృష్టం పడుతుంది..

Sivudu (2)

Sivudu (2)

సోమవారం శివుడికి ఇష్టమైన రోజు.. ఆ రోజు భక్తి శ్రద్దలతో ఆయనను పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి.. సోమవారం కొన్ని రకాల పనులు చెయ్యడం వల్ల అన్నిరకాల జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.. ఈరోజు సోమవారం పటించాల్సిన మంత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మీ కుటుంబంలో సంతోషం, ఐశ్వర్యం పెరగాలంటే మీరు సోమవారం రోజు మహాశివుడిని పూజించి 108 సార్లు ఈ ఓం నమః శివాయ మంత్రాన్ని పటించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి ఐశ్వర్యం, సంతోషం ఎప్పుడూ ఉంటాయి.. మీ ఇంట్లో లక్ష్మీ దేవి ఉండాలంటే సోమవారం రోజు 1.25 కిలోల బియ్యాన్ని తీసుకోవాలి. అందులో కొంత శివుని దేవాలయంలో సమర్పించాలి.మిగిలిన బియ్యాన్ని ఎవరికైనా దానం చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల మీకు ఎల్లప్పుడూ డబ్బుకు లోటు ఉండదు. ఇంకా చెప్పాలంటే ఏదైనా పనిలో విజయం సాధించాలంటే మీ ఇంట్లో కొమ్ములు లేని జింక చిత్రాన్ని పెట్టుకోవాలి..

ఆ ఫోటోను మీ ఇంట్లో పెట్టడం వల్ల అన్ని శుభాలే జరుగుతాయని పండితులు చెబుతున్నారు..ఓం అనే శబ్దాన్ని జపిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మీ కెరియర్ లో పురోగతిని సాధిస్తారు. అలాగే మీరు ఏ పని చేసినా ఆటంకాలు రాకుండా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే మీరు ఎంత సంపాదించినా ఆరోగ్యంగా ఉండడం ఎంతో ముఖ్యం. ఆరోగ్యం బాగుండాలంటే మీ ఇంటికి సమీపంలో ఏదైనా శివాలయానికి వెళ్లి స్వచ్ఛమైన నీటిలో కొన్ని చుక్కలు పాలు, గంగాజలం కలిపి శివలింగానికి సమర్పించాలి.. ఇలా చెయ్యడం వల్ల ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటారని పండితులు చెబుతున్నారు..

Exit mobile version