హిందూ పంచాంగం ప్రకారం మాఘ మాసం అత్యంత పవిత్రమైనది. ఈ మాసంలో వచ్చే పౌర్ణమిని ‘మాఘ పూర్ణిమ’ లేదా ‘మహా మాఘి’ అని పిలుస్తారు. దేవతలు సైతం భూలోకానికి వచ్చి గంగా నదిలో స్నానమాచరిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర దినాన చేసే స్నాన, జప, దానాలకు సాధారణ రోజుల కంటే వెయ్యి రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుందని పండితులు చెబుతుంటారు. 2026లో ఫిబ్రవరి 1వ తేదీన ఈ పర్వదినం వచ్చింది. ఈ రోజున ఏ వస్తువులను దానం చేయడం వల్ల ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
నువ్వుల దానం.. పితృ దోషాల నుంచి విముక్తి
మాఘ మాసానికి, నువ్వులకు విడదీయలేని సంబంధం ఉంది. మాఘ పూర్ణిమ నాడు నల్ల నువ్వులను దానం చేయడం వల్ల జాతకంలోని శని దోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా, మన పితృదేవతల ఆత్మకు శాంతి చేకూరుతుందని నమ్ముతారు. నువ్వులను నేరుగా కానీ లేదా నువ్వుల లడ్డూల రూపంలో కానీ పేదలకు పంపిణీ చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.
Raveena Tandon: నా కూతురిలో ఆ నటి ఆత్మ.. స్టార్ హీరోయిన్ సంచలనం
గొడుగు , చెప్పుల దానం.. అశ్వమేధ యాగ ఫలం
పురాణాల ప్రకారం, మాఘ పూర్ణిమ నాడు గొడుగును దానం చేయడం అత్యంత శ్రేష్ఠమైనది. దీనివల్ల జీవితంలో ఎదురయ్యే అరిష్టాలు, ఆకస్మిక విపత్తులు తొలగిపోతాయి. ఒక గొడుగును దానం చేయడం వల్ల ఒక అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని ప్రతీతి. అదేవిధంగా, పాదరక్షలు (చెప్పులు) దానం చేయడం వల్ల నరక భయం తొలగి మోక్షం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
వస్త్ర , అన్నదానం.. లక్ష్మీదేవి అనుగ్రహం
మాఘ పూర్ణిమ నాడు అన్నదానం చేయడం వల్ల అన్నపూర్ణేశ్వరి దేవి అనుగ్రహం లభిస్తుంది. ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టడం వల్ల ఇంట్లో ధాన్యానికి ఎప్పుడూ లోటు ఉండదు. అలాగే, చలికాలం ముగుస్తున్న సమయం కాబట్టి ఉన్ని వస్త్రాలు, దుప్పట్లు లేదా కొత్త బట్టలను దానం చేయడం వల్ల దారిద్ర్యం తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుంది. ముఖ్యంగా తెల్లని వస్త్రాలను దానం చేయడం వల్ల చంద్రుని అనుగ్రహం లభించి మనశ్శాంతి కలుగుతుంది.
నెయ్యి , బెల్లం.. గ్రహ దోష నివారణ
ఆవు నెయ్యి దానం చేయడం వల్ల శరీరానికి తేజస్సు, ఆరోగ్య సిద్ధి కలుగుతాయి. బెల్లం దానం చేయడం వల్ల జాతకంలో సూర్య గ్రహం బలోపేతమవుతుంది. దీనివల్ల సమాజంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పంచదార, నెయ్యి కలిపిన పదార్థాలను దానం చేయడం వల్ల కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి.
విద్యా దానం.. జ్ఞానవృద్ధి
మాఘ పూర్ణిమ కేవలం భక్తికే కాదు, జ్ఞానానికి కూడా ప్రతీక. ఈ రోజున పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు లేదా వారి చదువుకు అవసరమైన ఆర్థిక సహాయం చేయడం వల్ల సరస్వతీ దేవి కటాక్షం లభిస్తుంది. విజ్ఞానాన్ని పంచడం వల్ల మనలోని అజ్ఞానాంధకారం తొలగిపోయి బుద్ధి వికాసం కలుగుతుంది.
(గమనిక: ఈ కథనంలోని సమాచారం వివిధ ఆన్‌లైన్ మూలాలు, ధార్మిక గ్రంథాల నుండి సేకరించబడింది. పాఠకులు తమ నమ్మకాలు , పండితుల సలహాల మేరకు అనుసరించవచ్చు.)
Pawan Kalyan: కేజీహెచ్ నిర్లక్ష్యం.. గర్భంలోనే శిశువు మృతి.. చలించిన పవన్ కళ్యాణ్ ఏం చేశారంటే..?
