Site icon NTV Telugu

Dallas: ఈ నెల 25న వైభ‌వంగా శ్రీనివాసుడి క‌ల్యాణం

Temle

Temle

మనది ఆర్య సంస్కృతి. వేద సంస్కృతి. పండుగలకు ఉన్న ప్రాధాన్యత ఎంతటి గొప్పదో తెలుసు. పాశ్చాత్య దేశాలు సైతం మన సంస్కృతి, సంప్రదాయాలకు ఎంత విలువ ఇస్తారో తెలుసు. సంప్రదాయబద్దంగా అప్పుడు పండుగల్లో కొత్త బట్టలు ధరించి వేడుకలు ఘనంగా నిర్వహించేవారు. ఆడంబరంగా, అట్టహాసంగా, ఆనందంగా జరుపుకునేవారు. మూకుమ్మడిగా ప్రజలందరు కలిసి పండుగలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మన తెలుగు వారు ఎక్కడ వున్నా సంస్కృతి సాంప్ర‌దాయాల‌కు పెట్టింది పేరు.

దేశాలు దాటిన మ‌న భ‌క్తి పార‌వ‌శ్యాన్ని మ‌నం మ‌రిచిపోము మ‌న పండుగ‌లు , పూజ‌లు జ‌రిపి అక్క‌డున్న వారిని కూడా ఆక‌ట్టుకుంటాం. అయితే డ‌ల్లాస్‌లోని క్రెడిట్‌ యూనియన్‌ ఆఫ్‌ టెక్సాస్‌ ఈవెంట్‌ సెంటర్‌లో ఈ నెల 25న శ్రీనివాసుడి క‌ల్యాణాన్ని అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించ‌నున్నారు. తెలుగువారితో శ్రీవారి సుప్రభాత సేవ, తోమాల సేవ, అభిషేకం, కల్యాణ సేవలందుకోనున్నాడు.. అలెన్‌ ఈవెంట్‌ సెంటర్‌ క్రెడిట్‌ యూనియన్‌ ఆఫ్‌ టెక్సాస్‌ ఈవెంట్‌ సెంటర్‌ వేదికగా డ‌ల్లాస్‌ తెలంగాణ ప్రజాసమితి భక్తి ప్రపత్తులతో చేపడుతున్న ఈ విశేష కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వయంగా దేవదేవతల ప్రతిరూపాలను, పూజారులను వెంటబెట్టుకుని రానున్నారు.

డ‌ల్లాస్‌లో ఉంటున్న తెలంగాణ, తెలుగు, హిందూ ప్రజలందరికీ వెంకన్న దర్శనం, విశేషసేవల్లో భాగస్వాములయ్యే భాగ్యం కల్పించేందుకు టీపాడ్‌ తగిన ఏర్పాట్లను చేస్తున్నది. ప‌ద్మావ‌తి, అలిమేలు సమేత శ్రీనివాసుడి దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరికీ స్వామివారి లడ్డూ ప్రసాదం, విశేష పూజల్లో భాగస్వాములయ్యే వారికి తిరుమల లడ్డూతో పాటు వస్త్రం అందజేయనున్నట్టు టీపాడ్‌ ప్రతినిధులు తెలిపారు. వైభవంగా నిర్వహించే స్వామివారి విశేష సేవా కైంకర్యాల్లో పాల్గొనేవారు ముందుగా తమ పేర్లను రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సి ఉంటుందని నిర్వాహ‌కులు వివరించారు. అందరూ ఆహ్వానితులేనని, పార్కింగ్‌ కూడా ఉచితమని టీపాడ్‌ ప్రతినిధులు తెలిపారు.

VJ Sunny: ‘బిగ్ బాస్’ విన్నర్ విజె సన్నీపై రౌడీ షీటర్ దాడి..

Exit mobile version