Site icon NTV Telugu

Diwali lucky plants: దీపావళికి ఈ అదృష్ట మొక్కలను మీ ఇంటికి తీసుకువస్తున్నారా..! లక్ష్మీమాత కటాక్షం ఉన్న మొక్కలు ఏంటో తెలుసా..

Diwali Lucky Plants

Diwali Lucky Plants

Diwali lucky plants: భారత దేశంలో ప్రముఖ పండుగల్లో దీపావళి పండుగ ఒకటి. ప్రతి ఏడాది కార్తీక మాసంలో అమావాస్య రోజున దీపావళి పండుగ జరుపుకుంటారు. పండుగ రోజున లక్ష్మీదేవిని, గణేశుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. దీపావళి పండుగను దీపాల పండుగగా కూడా అని పిలుస్తారు. పండుగ సందర్భంగా ఆ రోజు ప్రతి ఇంట్లో దీపాలు వెలిగిస్తారు. దీపావళి పండుగ సమయంలో ఇంట్లో కొన్ని మొక్కలను నాటడం ద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుందని, ఆనందం, శ్రేయస్సు సంపదను అమ్మావారు ప్రసాదిస్తారని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆ మొక్కలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: West Bengal: బెంగాల్‌లో మరో వైద్య విద్యార్థినిపై అత్యాచారం.. క్యాంపస్ సమీపంలోనే దారుణం..

తులసి మొక్క: తులసిని లక్ష్మీదేవి రూపంగా, విష్ణువుకు ఇష్టమైనదిగా చాలా మంది ప్రజలు భావిస్తారు. ఇంట్లో తులసి మొక్కను నాటడం మతపరంగా, ఆరోగ్యం, వాస్తు దృక్కోణాల నుంచి చాలా మందిగా పరిగణిస్తారు. తులసి మొక్కను పూజించిన ఇంట్లో లక్ష్మీదేవి కొలువుదీరుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

తెల్ల పలాశ: ఈ తెల్ల పలాశ మొక్క వ్యాధుల నుంచి ఉపశమనాన్ని ఇస్తుందని చాలా మంది నమ్ముతారు. దీనిని లక్ష్మీదేవి మొక్క అని కూడా పిలుస్తారు. ఇంట్లో లేదా ప్రార్థనా స్థలంలో దీనిని నాటడం వల్ల సంపద, శ్రేయస్సు, సంతోషం పెరుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. వీటికి అదనంగా ఈ మొక్క ఇంట్లో సానుకూల వాతావరణాన్ని పెంపొందిస్తుందని, వాస్తు లోపాలను తగ్గించడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని అంటున్నారు.

పాము మొక్క: పాము మొక్క ప్రతికూల శక్తిని దూరం చేస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇది ఇంట్లో శాంతి, సమతుల్యతను కాపాడుతుందని పేర్కొన్నారు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ మొక్కను ఉంచడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఇది సంపదను ఆకర్షిస్తుందని, ఉద్యోగం లేదా వ్యాపారంలో పురోగతిని ప్రోత్సహిస్తుందని విశ్వసిస్తారు.

క్రాసులా మొక్క: క్రాసులా మొక్కను సాధారణంగా “జెట్ ప్లాంట్” అని కూడా పిలుస్తారు. ఈ మొక్కను ఇంటికి, పనికి అదృష్టాన్ని, విజయాన్ని తీసుకువస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇంట్లో లేదా కార్యాలయంలో క్రాసులా మొక్కను ఉంచడం ద్వారా ఆర్థిక శ్రేయస్సు మెరుగుపడుతుందని, సంపద పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు.

మనీ ప్లాంట్: మనీ ప్లాంట్ ఇంటికి, కార్యాలయానికి సంపద, శ్రేయస్సు, సానుకూల శక్తిని తెస్తుందని చాలా మంది భావిస్తారు. మతపరమైన, వాస్తు శాస్త్ర గ్రంథాల ప్రకారం.. లక్ష్మీ దేవి ఈ మొక్క ఉంచిన ప్రదేశంలో పూజలు చేస్తుందని విశ్వసిస్తారు. ఈ మొక్క ఇంటికి ఆనందం, శాంతి, శ్రేయస్సును తెస్తుందని చాలా మంది నమ్ముతారు.

READ ALSO: India Missiles 2025: భారత క్షిపణుల ముందు పాక్ అస్త్ర సన్యాసం చేయాల్సిందే..

Exit mobile version