Koti Deepotsavam 2026: హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఘనంగా జరుగుతోంది కోటి దీపోత్సవం.. కార్తీక పౌర్ణమి సందర్భంగా కోటి దీపయజ్ఞంలో నేడు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కోటి దీపోత్సవం 2026లో భాగంగా మంగళవారం పదకొండవ రోజు వేడుకలు భక్తిశ్రద్ధలతో జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రముఖ పీఠాధిపతి అనుగ్రహ భాషణం, ప్రవచనామృతం, ప్రత్యేక పూజలు, స్వామివారి కల్యాణం, వాహన సేవ వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
నేటి కోటి దీపోత్సవం షెడ్యూల్.. ప్రత్యేక కార్యక్రమాలు
* మైసూరులోని అవధూత దత్తపీఠం పీఠాధిపతి పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అనుగ్రహ భాషణం ఇవ్వనున్నారు. అనంతరం బ్రహ్మశ్రీ డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి ప్రవచనామృతం భక్తులకు వినిపించనున్నారు.
* వేదికపై నిర్వహించే ప్రత్యేక పూజల్లో భాగంగా తిరువణ్ణామలై అరుణాచలేశ్వరునికి బిల్వార్చన సహిత మహానీరాజనం సమర్పించనున్నారు. అలాగే భక్తులచే శివలింగాలకు బిల్వార్చన కార్యక్రమం నిర్వహించనున్నారు.
* కార్తీక పౌర్ణమి ప్రత్యేకతను చాటుతూ శ్రీ అపీతకుచాంబికా అరుణాచలేశ్వర స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. అనంతరం స్వామివారి పల్లకి వాహన సేవ జరగనుంది.
కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజున జరుగుతున్న ఈ ప్రత్యేక కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని సాదరంగా ఆహ్వానం పలుకుతుంది రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ (RTPL).. ఇక ప్రతీ ఏడాది.. ప్రతి రోజు లాగా.. పూజా సామాగ్రి.. దీపారాధనకు అవసరమైన అన్ని వస్తువులను ఉచితంగా అందజేస్తున్న విషయం విదితమే..

