కైలాసాన్ని తలపించే వేదిక.. కోటి దీపోత్సవంలో తొలిరోజు విశేషాలివే.!

  • శంఖారావం మధ్య కోటి దీపోత్సవం ప్రారంభం
  • సహస్రలింగానికి అష్టోత్తర శత శంఖాభిషేకం
  • కోటి మల్లెల అర్చన.. ముక్తీశ్వర స్వామి కల్యాణం
  • తొలి కార్తిక దీప ప్రజ్వలన.. బంగారు లింగోద్భవ దర్శనం
Bhakti 1

Bhakti 1

కార్తీక మాసపు పవిత్రతను నలుదిశలా చాటుతూ భక్తులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అతిపెద్ద ఆధ్యాత్మిక మహోత్సవం భక్తి టీవీ ‘కోటి దీపోత్సవం-2026’ నేడు (నవంబర్ 14, శనివారం) హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. కార్తీక శుద్ధ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని జరగనున్న ఈ తొలిరోజు వేడుకల్లో ప్రదోషకాల అభిషేకం, సహస్రలింగానికి అష్టోత్తర శత శంఖాభిషేకం, భక్తులు స్వయంగా ఆచరించే కోటి మల్లెల అర్చన, కాళేశ్వరం శ్రీ ముక్తీశ్వర స్వామి కల్యాణోత్సవం వంటి విశేష ఘట్టాలతో పాటు పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి మహాస్వామీజీ ఆశీర్వచనం, తొలి కార్తిక దీప ప్రజ్వలన, బంగారు లింగోద్భవ దర్శనం, సప్త హారతులు మరియు అద్భుతమైన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు కనువిందు చేయనున్నాయి. కైలాసాన్ని తలపించే ఈ మహా ఆధ్యాత్మిక వేడుకను కింద ఉన్న లైవ్ వీడియో ద్వారా వీక్షించి తరించండి.