Koti Deepotsavam 2026: కార్తీక మాసంలో భక్తి టీవీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే కోటి దీపోత్సవం కన్నుల పండుగగా కొనసాగుతోంది.. శివ నామస్మరణతో హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం పరిసర ప్రాంతాలు మార్మోగుతున్నాయి.. ఇప్పటికే మూడు రోజులు దిగ్విజయంగా సాగిన కోటి దీపోత్సవం వేదికగా ఇవాళ నాలుగో రోజు పలు ఆధ్యాత్మిక, భక్తి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. కార్తీక మంగళవారం, గోపాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు, ప్రవచనాలు, అమ్మవార్లకు కోటీకుంకుమార్చన, కల్యాణోత్సవం, వాహన సేవలు జరగనున్నాయి. నేటి కార్యక్రమాల్లో భాగంగా పలువురు పీఠాధిపతుల అనుగ్రహ భాషణాలు భక్తులకు ఆధ్యాత్మిక సందేశాన్ని అందించనున్నాయి.
నేటి కోటి దీపోత్సవం కార్యక్రమాల షెడ్యూల్
1. అనుగ్రహ భాషణం – శ్రీశ్రీశ్రీ డా. నిర్మలానందనాథ మహాస్వామీజీ (శ్రీ ఆదిచుంచనగిరి మఠం, కర్ణాటక), శ్రీ విద్యా ప్రసన్న తీర్థ స్వామీజీ (కుక్కే సుబ్రహ్మణ్య మఠం, కర్ణాటక)
2. ప్రవచనామృతం – డా. ఎస్. అనంతలక్ష్మి (ఆధ్యాత్మిక ప్రవచనకర్త)
3. వేదికపై ప్రసిద్ధ క్షేత్రాల అమ్మవార్లకు కోటీకుంకుమార్చన నిర్వహించనున్నారు.. మైసూరు చాముండేశ్వరీదేవి వైభవం చూడవచ్చు..
4. భక్తులచే దుర్గా విగ్రహాలకు కోటీకుంకుమార్చన నిర్వహిస్తారు..
5. వరంగల్ శ్రీ భద్రకాళీశ్వరుల కల్యాణం కన్నుల పండుగా సాగనుంది..
6. వాహన సేవ: సింహ వాహనం శ్రీ భద్రకాళీశ్వరులు దర్శనం ఇవ్వనున్నారు..
నాలుగో రోజు కార్యక్రమాల్లో భాగంగా పీఠాధిపతుల అనుగ్రహ భాషణాలు, డా. ఎస్. అనంతలక్ష్మి ఆధ్యాత్మిక ప్రవచనం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అలాగే అమ్మవార్లకు కోటీకుంకుమార్చన, దుర్గా విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. వరంగల్ శ్రీ భద్రకాళీశ్వరుల కల్యాణం, సింహ వాహన సేవతో నేటి కోటి దీపోత్సవ కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించనున్నాయి. ఈ ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలతో నాలుగో రోజు కోటి దీపోత్సవ వేడుకలు భక్తి భావంతో సాగనున్నాయి. యథావిథిగా భక్తులకు ఉచితంగా అందజేయనుంది రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం.. ఈ దీప యజ్ఞంలో పాల్గొనాల్సిందిగా ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ భక్తులకు సాదరంగా ఆహ్వానం పలుకుతోంది..

