Koti Deepotsavam 2025: భక్తి, ఆరాధన, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా ఏటా కార్తీకమాసంలో ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీల ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవం 2025 వేడుకలు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. శనివారం ప్రారంభమైన ఈ వేడుకలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి దీపాలు వెలిగిస్తున్నారు. కోటి దీపోత్సవం వేడుక కైలాసాన్ని తలపిస్తోంది. 2012లో లక్ష దీపోత్సవంగా మొదలై, 2013లో కోటి దీపోత్సవంగా మారి భక్తుల మదిలో అఖండ జ్యోతిగా వెలుగొందుతున్న ఈ దీపాల పండుగ, కార్తిక మాసానికి నూతన వైభవాన్ని తీసుకువస్తోంది. ఈ మహాక్రతువులో గురువులు, పీఠాధిపతులు, మఠాధిపతులు పాల్గొంటున్నారు. నాలుగవ రోజు విశేష కార్యక్రమాల గురించి తెలుసుకుందాం..
నాలుగవ రోజు విశేష కార్యక్రమాలు (4-11-2025 – కార్తిక మంగళవారం – వైకుంఠ చతుర్దశి)
పూజ్యశ్రీ పరిపూర్ణానందగిరి మహాస్వామీజీ (శ్రీ వ్యాసాశ్రమం పీఠాధిపతి, ఏర్పేడు), పూజ్యశ్రీ వామనాశ్రమ మహాస్వామీజీ (హల్దీపురం పీఠాధిపతి, వైశ్య కుల గురువులు) ఆధ్వర్యంలో అనుగ్రహ భాషణం ఉంటుంది. బ్రహ్మశ్రీ డా॥ కాకునూరి సూర్యనారాయణ మూర్తిచే ప్రవచనామృతం నిర్వహిస్తారు. అలాగే.. వేదికపై శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, రజత గోమాత పూజ, శత అష్టోత్తర పంచహారతులు కన్నులు పండువగా నిర్వహిస్తారు. అనంతరం.. భక్తులచే పూజ విష్ణుమూర్తి విగ్రహాలకు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఉంటుంది. శ్రీరంగం శ్రీ రంగనాథస్వామి కల్యాణం, పల్లకీ వాహన సేవతో ముగుస్తాయి.
READ MORE: Anushka Sharma: ఇదే మంచి సమయం.. అనుష్క శర్మ సినిమా రిలీజ్ చేయండి!
