Site icon NTV Telugu

Koti Deepotsavam 2025: కోటి దీపోత్సవంలో నేటి విశేష కార్యక్రమాలు ఇవే..

Koti Deepotsavam 2025

Koti Deepotsavam 2025

Koti Deepotsavam 2025: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా ఆధ్యాత్మిక మహా సమ్మేళనం కొనసాగుతోంది.. భక్తి టీవీ నేతృత్వంలో జరుగుతోన్న కోటి దీపోత్సవంలో ఇప్పటికే విజయవంతంగా ఏడు రోజుల పాటు విశేష కార్యక్రమాలు నిర్వహించారు.. ప్రతీ రోజూ విశేష పూజలు.. కల్యాణాలు.. ప్రవచనాలు, వాహన సేవలతో భక్తులను కట్టిపడేస్తోంది కోటి దీపోత్సవం వేడుక..

Read Also: IND vs AUS: నేడు ఆస్ట్రేలియా- భారత్ మధ్య ఐదో టీ20.. సిరీస్ గెలిచేనా..?

ఇక, ఈ కోటి దీపాల పండుగలో భాగంగా ఎనిమిదవ రోజు అంటే ఈ రోజు విశేష కార్యక్రమాలు నిర్వహించనున్నారు.. హల్దీపురం మఠాధిపతి, వైశ్య కుల గురువులు పూజ్యశ్రీ వామనాశ్రమ మహాస్వామీజీ చే అనుగ్రహ భాషణం.. బ్రహ్మశ్రీ వేదాంతం రాజగోపాల చక్రవర్తి ప్రవచనామృతం అందించనున్నారు.. వేదికపై కాజీపేట శ్వేతార్క మహాగణపతికి కోటి గరికార్చన నిర్వహించి.. ఉజ్జయిని మహాకాళునికి భస్మహారతి ఇవ్వనున్నారు.. మరోవైపు, భక్తులచే గణపతి విగ్రహాలకు కోటి గరికార్చన జరిపించనున్నారు.. కోటి దీపోత్సవం వేదికగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి కల్యాణోత్సవం జరిపించనున్నారు.. ఈ రోజు నంది వాహన సేవ నిర్వహిస్తారు.. ఇక, సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగనున్నాయి..

Read Also: Samantha : రాజ్ నిడుమోరుకు సమంత హగ్.. కన్ఫర్మ్ చేసేస్తున్నారా..

కాగా, హిందూ ధర్మ పరిరక్షణ కోసం.. సనాతన ధర్మ వ్యాప్తి కోసం.. లక్షల దీపాలతో లక్ష దీపోత్సవంగా ప్రారంభించిన ఈ దీపోత్సవం.. ఆ తర్వాత కోటి దీపాల యజ్ఞంగా రూపాంతరం చెందింది.. అది ఎంతలా అంటే.. కార్తీక మాసం వచ్చిందంటే చాలు.. ప్రతీ ఏటా భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా నిర్వహించే కోటి దీపోత్సవం గురించి భక్తులు ఎంతో ఆతృతగా ఎదురుచూసేంత వరకు వెళ్లింది.. ఆ కైలాసమే భువికి దిగివచ్చిందా అనేలా ఏర్పాటు చేసే ఇల కైలాసంలో ప్రతీ రోజు ఒక్కో ప్రత్యేకత.. ఒక్కో కల్యాణం.. లింగోద్భవం.. వాహనసేవ.. భక్తులచే స్వయంగా అభిషేకాలు, అర్చనలు.. మఠాధిపతులు, పీఠాధిపతులు.. రాజకీయ నేతలు, ప్రముఖులు ఉపన్యాసానాలు.. ప్రవచనాలు ఇలా ఆద్యంతం.. కోటి దీపాల పండుగ కట్టి పడేస్తోన్న విషయం విదితమే..

Exit mobile version