Koti Deepotsavam 2024 Day 3 LIVE : ఉజ్జయిని మహాకాళ్ కల్యాణం..

  • కన్నుల పండుగగా కోటి దీపోత్సవం..
  • కార్తిక సోమవారము శుభవేళ ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి కల్యాణం..
  • ఎన్టీఆర్‌ స్టేడియంలో కోటి దీపాల పండుగ..
Koti Deepotsavam 2024 Day 3

Koti Deepotsavam 2024 Day 3

Koti Deepotsavam 2024 Day 3 LIVE : కార్తిక సోమవారము శుభవేళ ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి కల్యాణం చూసే మహా భాగ్యాన్ని కల్పిస్తోంది భక్తి టీవీ.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో ‘కోటి దీపోత్సవం’ దిగ్విజయంగా కొనసాగుతోంది. దీపాల పండగలో ఇప్పటికే రెండు రోజులు పూర్తి కాగా.. వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఇక, నేడు కోటి దీపోత్సవంలో మూడవ రోజు. అందులోనూ కార్తిక సోమవారం కాబట్టి.. భక్తులు తండోపతండాలుగా తరలిరానున్నారు. భక్తుల శివనామస్మరణతో ఎన్టీఆర్‌ స్టేడియం పరిసర ప్రాంతాలు మార్మోగుతున్నాయి..

 

కోటి దీపోత్సవంలో మూడవ రోజు పరమ పూజ్య శ్రీ శ్రీ వామనాశ్రమ మహా స్వామీజీ (వైశ్య గురు మఠము హలదీపూర్ మరియు వారణాసి), శ్రీ శివానంద భారతి స్వామీజీ (కర్ణాటక హోస్పేట చింతామణి మఠం) గారిచే అనుగ్రహ భాషణం ఉండగా.. శ్రీ బంగారయ్య శర్మ గారు ప్రవచనామృతం చేయనున్నారు. వేదికపై శివపరివారానికి కోటి బిల్వార్చన, భక్తులచే శివలింగాలకు కోటి బిల్వార్చన, కోటి దీపోత్సవం వేదికపై జ్యోతిర్లింగ క్షేత్రం ఉజ్జయిని మహాకాళ్ కల్యాణం, పల్లకీ వాహన సేవ ఉంటుంది. కోటి బిల్వార్చన.. లింగోద్బవం, సప్తహారతులు, మరెన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వేదికైన కోటి దీపోత్సవానికి సాదరంగా స్వాగతం పలుకుతోంది రచనా టెలివిజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్.. అందరూ పాల్గొనండి… పరమేశ్వరుని అనుగ్రహానికి పాత్రులుకండి.. ఇక, కోటి దీపోత్సవంలోని విశేష కార్యక్రమాలను లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..