Site icon NTV Telugu

Koti Deepotsavam 2022: 12వ రోజు కోటిదీపోత్సవం.. నేటి విశేష కార్యక్రమాలు ఇవే..

Koti Deepotsavam

Koti Deepotsavam

Koti Deepotsavam 2022: ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో కోటి దీపోత్సవం కన్నుల పండుగగా సాగుతోంది.. అక్టోబర్‌ 31వ తేదీన ఈ మహా యజ్ఞానికి అంకురార్పణ జరిగింది.. ఈ నెల 14వ తేదీతో కోటి దీపాల ఉత్సవం ముగియనుంది.. ఇప్పటికే 11 రోజుల పాటు విజయవంతంగా కార్యక్రమాలను నిర్వహించిన రచనా టెలివిజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్.. 12వ రోజు కార్యక్రమ నిర్వహణకు సిద్ధమైంది.. ఇక, 12వ రోజు జరగనున్న విశేష కార్యక్రమాలకు సంబంధించిన వివరాల్లోకి వస్తే..

* అనుగ్రహ భాషణం: శ్రీ మధుపండిత దాస (హరేకృష్ణ మూమెంట్‌, బెంగళూరు), శ్రీ సత్య గౌరచంద్ర దాస (హరేకృష్ణ గోల్డెన్‌ టెంపుల్‌, హైదరాబాద్‌)

* ప్రవచనామృతం: బ్రహ్మశ్రీ డాక్టర్‌ బాచంపల్లి సంతోష్‌ కుమార్‌ శాస్త్రి

* వేదికపై పూజ: శక్తిపీఠాలు, దేవీక్షేత్రాల అమ్మవార్లకు కోటి కంకుమార్చన

* భక్తులచే పూజ: లక్ష్మీ విగ్రహాలకు కోటి కుంకుమార్చన

* కల్యాణం: మధురై శ్రీ మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణోత్సవం

* వాహనసేవ: పల్లకీ సేవ నిర్వహించనున్నారు.. ఎన్టీఆర్‌ స్టేడియంలో జరుగుతోన్న కోటి దీపోత్సవానికి ఆహ్వానం పలుకుతున్నాయి ఎన్టీవీ, భక్తి టీవీ, వనితా టీవీ.. తరలి రండి.. ఈ కోటి దీపోత్సవంలో భాగస్వాములు కండి.. భగవంతుడి కృపకు పాత్రులు కండి..

Exit mobile version