NTV Telugu Site icon

Krishnashtami: మీ ఇంట్లో చిన్న కృష్ణులున్నారా?.. గోకులాష్టమి విశిష్టత ఇదే.. జన్మాష్టమిని ఇలా జరుపుకోండి

Krishna

Krishna

సనాతన ధర్మంలో కృష్ణ జన్మాష్టమికి చాలా ప్రాముఖ్యత ఉంది. శ్రీ కృష్ణ భగవానుడి జన్మదినాన్ని కృష్ణ జన్మాష్టమి అంటారు. మత విశ్వాసాల ప్రకారం శ్రీ కృష్ణుడు శ్రావణ మాసంలోని కృష్ణ పక్షంలోని అష్టమి తిథి, రోహిణి నక్షత్రంలో జన్మించాడు. శ్రీ మహా విష్ణువు ఎనిమిదో అవతారంగా శ్రీకృష్ణుడు జన్మించాడని భక్తుల విశ్వాసం. సృష్టి స్థితి కారుడైన శ్రీకృష్ణుడి జన్మ దినాన్ని ”కృష్ణాష్టమి”గా వేడుక చేసుకుంటాం. అంతే కాకుండా కృష్ణాష్టమిని “గోకులాష్టమి”, “అష్టమి రోహిణి”, “శ్రీకృష్ణ జన్మాష్టమి”, “శ్రీకృష్ణ జయంతి”, “శ్రీ జయంతి”, “సాతం ఆతం”, “జన్మాష్టమి” ఇలా రకరకాలుగా వ్యవహరిస్తారు.

READ MIORE: అత్యుత్తమ పురాతన ఆర్కిటెక్చర్ ఉన్న టాప్ 10 దేశాలు

వేణు మాధవుడు లోకానికి గురువు. గీతను బోధించి లోకంలో ఉండే ప్రతి ఒక్కరికీ దారి చూపాడు. చిన్నతనంలో కన్నయ్య అల్లరి పిల్లాడుగా.. తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని వివరించాడు. వెన్న దొంగగా మారి గోపికలతో పాటు అందరి మనసులను దోచుకున్నాడు. అంతేకాదు గోప బాలకుడిగా, సోదరునిగా, అసురసంహారిగా, ధర్మ సంరక్షకుడిగా ఎన్నో పాత్రలు పోషించాడు. కన్నయ్య ఎన్ని పాత్రలు పోషించినా అంతా లోక కళ్యాణం కోసమే. అందుకే కన్నయ్యను అందరు బాగా ఇష్టపడతారు. అందుకే కృష్ణాష్టమి వస్తోందంటే చాలు.. దేశవ్యాప్తంగా సందడి నెలకొంటుంది. ఈ పవిత్రమైన రోజున చిన్నారులను కన్నయ్య రూపంలో అలంకరించి పూజిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కృష్ణాష్టమి ఆగస్టు 26వ తేదీ సోమవారం నాడు వచ్చింది. ఈ సందర్భంగా కృష్ణుడి గురించి.. కృష్ణాష్టమి విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం…

READ MORE: Top Headlines @9PM : టాప్ న్యూస్

వెన్నదొంగ జన్మ రహస్యం..

భాగవతం ప్రకారం.. పరమ రాక్షసుడైన కంసుడి చెల్లెలు దేవకి. తనకి ఆమె అంటే ఎంతో ప్రేమ. తనకు వసుదేవుడితో వివాహం జరిపించి అత్తారింటికి పంపే సమయంలో ఆకాశవాణి తన చెల్లెలి కడుపులో ఎనిమిదో సంతానంగా పుట్టే కుమారుడు కంసుడిని అంతమొందిస్తాడని చెబుతుంది. దీంతో ఆగ్రహానికి గురైన కంసుడు తన చెల్లెలు దేవకి, బావ వసుదేవులను కర్మాగారంలో బంధిస్తాడు. వారికి పుట్టిన బిడ్డలను పురిట్లోనే చంపేస్తుంటాడు. లా ఏడుగురు చిన్నారులను కోల్పోయిన దేవకీ ఎనిమిదోసారి గర్భం దాలుస్తుంది. ఆ బిడ్డ తన అంతు చూస్తాడని కంసుడికి ముందుగానే తెలుసు కాబట్టి కారాగారం వద్ద భద్రతను మరింత పటిష్టం చేస్తాడు. అయితే నెలలు నిండిన దేవకి శ్రావణ మాసంలో బహుళ అష్టమి నాడు రోహిణి నక్షత్రం వేళ అర్ధరాత్రి వేళ శ్రీ కృష్ణుడు జన్మించాడు. తనని ఎలాగైనా రక్షించాలనుకుంటారు దేవకీ వసుదేవులు.

READ MORE: మీకు తెలియని 10 ఆశ్చర్యకరమైన వాస్తవాలు..

విష్ణుమూర్తి ప్రత్యక్షం..

అదే సమయంలో ఆ చిన్నారి శ్రీ విష్ణుమూర్తిగా ప్రత్యక్షమై ఏం చేయాలో వివరిస్తాడు. వెంటనే వసుదేవుని సంకెళ్లు తెగిపోతాయి. కారాగారం తలుపులు తెరచుకుంటాయి. సైనికులు సొమ్మసిల్లి పడిపోతారు. ఆ బాల కృష్ణుడిని వసుదేవుడు బుట్టలో నిద్రపుచ్చి రేపల్లెకు బయలుదేరుతాడు. అప్పుడు దారిలో కుండపోతగా వర్షం కురుస్తుంది. కన్నయ్యపై వర్షపు చినుకులు పడకుండా ఆదిశేషుడు పడగలా మారి గొడుగు పడతాడు. ఆ తర్వాత వసుదేవుడు యమునా నది దాటుకుంటూ వెళ్లి రేపల్లె చేరుకుంటాడు. అక్కడ యాదవ రాజైన నందుని భార్య యశోద ఆడపిల్లకు జన్మనిస్తుంది. అది గమనించిన వసుదేవుడు కన్నయ్యను యశోద పక్కన పడుకోబెట్టి.. ఆడపిల్లను తన చేతుల్లోకి తీసుకుని అక్కడి నుంచి తిరిగి కారాగారానికి తీసుకెళ్తాడు. అప్పుడు తన సంకెళ్లు వాటికవే పడతాయి. భటులు మేల్కొంటారు. పసిబిడ్డ ఏడుపులు విని కంసుని సమాచారం చేరవేస్తారు.

READ MORE: Harish Rao : నా ఊపిరి ఉన్నంతవరకు సిద్దిపేట అభివృద్ధి కోసం కృషి చేస్తా

శ్రీకృష్ణ జన్మాష్టమి..

ఆకాశవాణి చెప్పిన ప్రకారం మగ బిడ్డ పుట్టాలి. ఆడపిల్ల పుట్టిందని.. తన వల్ల కంసుడికి ఎలాంటి ప్రమాదం ఉండదని దేవకి ఎంత బతిమాలినా కంసుడు పట్టించుకోకుండా చంపడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే ఆ పాప యోగ మాయగా మారి.. కంసుడికి దొరక్కుండా పైకి ఎగసి ‘‘నిన్ను చంపేవాడు పుట్టాడు.. రేపల్లెలో పెరుగుతున్నాడు’’ అని చెప్పి మాయమవుతుంది. మరోవైపు రేపల్లెలో నందుడి ఇంట మగ బిడ్డ జన్మించడంతో రేపల్లెలో పెద్ద ఉత్సవం జరిపిస్తారు. అదే గోకులాష్టమిగా ప్రసిద్ధికెక్కింది.

READ MORE: Crime: తల్లిని కొడుతున్నాడని తండ్రిని చంపిన బాలుడు..

శ్రీకృష్ణ జన్మాష్టమిని ఎలా జరుపుకోవాలంటే…

శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కృష్ణుడు ఇంట్లోకి రావాలని ఆశిస్తూ వాకిట్లో బియ్యప్పిండి లేదా ముగ్గుతో బాల గోపాలుడి పాదాలను తీర్చిదిద్దడంతో పండుగ వాతావరణం మొదలవుతుంది. ద్వారాలకు మావిడాకులు, వివిధ పూవులతో తోరణాలు కట్టి, కృష్ణుని విగ్రహాన్ని తడి వస్త్రంతో శుభ్రపరచి, చందనం, కుంకుమలతో తిలకం దిద్దాలి. కృష్ణుని విగ్రహాన్ని, పూజా మందిరాన్ని పూవులతో అలంకరించాలి. అక్షింతలు, ధూపదీపాలతో పూజించాలి. పాయసం, వడపప్పు, చక్రపొంగలి లాంటి ప్రసాదాలతో బాటు శొంఠి, బెల్లంతో చేసిన పానకం, వెన్న, మీగడ, పాలు నైవేద్యంగా పెట్టాలి. ముఖ్యంగా అటుకులను తప్పనిసరిగా సమర్పించాలి. కృష్ణుడికి కుచేలుడు ప్రేమగా అటుకులను ఇచ్చాడు. ఆ అటుకులు తీసుకుని, కుచేలునికి సర్వం ప్రసాదించాడు గనుక, ఈ పర్వదినాన బెల్లం కలిపిన అటుకులను పూజలో తప్పకుండా ఉంచాలి. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని, అష్టమి నాడు ఉపవాసం ఉండి, నవమి ఘడియల్లో పారణతో ముగించాలి. ఈ వేడుక రోజున ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. మమాఖిల పాప ప్రశమనపూర్వక సర్వాభీష్ట సిద్ధయే.. ‘శ్రీ జన్మాష్టమీ వ్రతమహం కరిష్యే అనే మంత్రాన్ని స్మరిస్తూ పూజ చేసుకోవాలి.

                                              “మీ అందరి శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు”