NTV Telugu Site icon

Dussera 2024: దశమికి జ‌మ్మి చెట్టుకి ఉన్న సంబంధం ఏమిటి..?

Daseera 2024

Daseera 2024

Dussera 2024: దసరా పండుగ.. విజయదశమి రోజున జమ్మిచెట్టుకు పూజలు చేస్తారు. ఇలా ఎందుకు చేస్తారు? శమీ చెట్టుకి విజయదశమికి సంబంధం ఏమిటి?పురాణాలలో జమ్మిచెట్టుకు చాలా ప్రాముఖ్యత ఉంది. జమ్మిచెట్టును పూజించే సంప్రదాయం ద్వాపర యుగం నాటిది. జమ్మిచెట్టును పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. శమీ వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాలలో చెప్పబడింది. శ్రవణా నక్షత్రం విజయదశమి నాడు, దేవీ నవ రాత్రిలలో పదవ రోజు అంటే ఈ రోజున జమ్మిచెట్టును పూజించడం లక్ష్మీప్రదం అని పురాణాలు కూడా చెబుతున్నాయి. ఇంట్లో పూజా స్థలంలో, నగదు పెట్టెలలో జమ్మి చెట్టు ఆకులను ఉంచడం వల్ల సంపద పెరుగుతుందని నమ్ముతారు.

Read also: Astrology: అక్టోబర్ 12, శనివారం దినఫలాలు

అంతేకాదు.. పురాణాల్లో జమ్మిచెట్టుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. క్షీరసాగర మధనంలో కల్పవృక్షంతోపాటు మరికొన్ని దేవతా వృక్షాలు పుట్టాయని చెబుతారు. అందులో జమ్మిచెట్టు ఒకటి. దీనిని సంస్కృతంలో శమి చెట్టు అంటారు. అలాగే, రామాయణం, మహాభారతాలలో జమ్మి చెట్టు ప్రముఖమైనది. మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ బట్టలు, ఆయుధాలను జమ్మిచెట్టులో దాచారని చెబుతారు. అవి ఇతరులకు ఆ వస్తువులు అస్తికలమాదిరిగా కనిపించేవని చెబుతారు. పాండవులు వనవాసం ముగిశాక జమ్మిచెట్టుకు పూజలు చేసి ఆయుధాలను దించి కౌరవ సైన్యాన్ని తరిమికొట్టినట్లు చెబుతారు. అందుకే విజయదశమి నాడు జమ్మిచెట్టును అమ్మవారి ప్రతిరూపంగా కొలిచి పూజిస్తారు. జమ్మి ఆకు బంగారంగా పంచుకుంటారు. పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు. అలయ్-బలాయి పేరుతో ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు.

Read also: Janaka Aithe Ganaka Review: జనక అయితే గనక రివ్యూ.. సూహాస్ హిట్ కొట్టాడా?

శమీ శమియతే పాపం !
శమీ శత్రు వినాశం !
అర్జునస్య ధనుర్ధారి !
రామస్య ప్రియదర్శని!!

దసరా పండుగ రోజున కాగితంపై పై శ్లోకాన్ని రాసి ఆ కాగితాన్ని జమ్మిచెట్టు దగ్గర ఉంచి పూజిస్తారు. సాయంత్రం.. సూర్యాస్తమయం సమయంలో.. జమ్మిచెట్టు వద్ద సకల దేవతలను పూజిస్తారు. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం.
India vs New Zealand: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టు ఇదే..