NTV Telugu Site icon

Bhishma Ekadashi: నేడు భీష్మ ఏకాదశి.. మీ కష్టాలు తీరాలంటే ఇలా చేయండి!

Bheeshma

Bheeshma

భారతీయ సంస్కృతిలో పండగలు, మాసాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో భక్తులు పూజలు, ఉపవాసాలు చేస్తుంటారు. తమ జీవితాల్లో కష్టాలు తొలగి సుఖశాంతులు కలగాలని కోరుకుంటు ఉంటారు. కాగా నేడు (ఫిబ్రవరి08) భీష్మ ఏకాదశి. మాఘ శుక్ల ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటారు. భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా అంటారు. ప్రతీ ఏటా మాఘ మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు భీష్మ ఏకాదశి జరుపుకుంటారు. శ్రీ విష్ణు సహస్రనామాన్ని భీష్మపితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం. ఈ రోజు విష్ణు సహస్రనామాలని చదివితే మేలైన ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు.

కార్తీక మాసం, శ్రావణ మాసాల్లాగే, మాఘ మాసం కూడా ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో పవిత్రమైన నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తే ఆపదలు తొలుగుతాయని చెబుతుంటారు. పూజలు, ఉపవాసాలు చేయడం ద్వారా భాదల నుంచి విముక్తి పొందుతారని పండితులు చెబుతున్నారు. విష్ణు సహస్రనామాలతో పూజించిన పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారని చెబుతుంటారు. పురాణాల ప్రకారం విష్ణు సహస్రనామ పారాయణం చాలా విశిష్టమైనది. భీష్మ ఏకాదశి నాడు ఈ విష్ణు సహస్రనామాలను పఠిస్తే శుభాలు కలుగుతాయి. స్వర్గలోక ప్రాప్తి కూడా కలుగుతుందని విశ్వసిస్తుంటారు.

ముఖ్యంగా విష్ణు సహస్ర నామ జపం, ధ్యానం వల్ల భయం తొలగుతుంది, శుభం కలుగుతుంది. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదివినా, విన్నా మోక్షం కలుగుతుంది. ఈ రోజు గోవులను పూజిస్తే మంచి ఫలితాలను అందుకోవచ్చు. లక్ష్మీనరసింహ స్వామికి పసుపు రంగుతో కూడిన ఫలాలను సమర్పిస్తే శుభాలు కలుగుతాయి. భీష్మ ఏకాదశి సందర్భంగా తల స్నానం చేసి పసుపు రంగు దుస్తులను ధరించి శ్రీ మహా విష్ణువును ఆరాధించాలి. ఉపవాసం, జాగరణ చేయాలి. ఇలా చేస్తే మీ కష్టాలు తీరి.. సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు చూకూరుతాయని పండితులు చెబుతున్నారు.