Ganesh chathurdhi: హిందువులు జరుపుకునే పండుగల్లో వినాయక చవితి కూడా ఒకటి. వినాయక చవితి రోజున భక్తులు వేకువ జామునే లేచి ఇల్లు శుభ్రం చేసుకుంటారు. తల స్నానం చేసి వినాయకుని మండపాన్ని అలంకరిస్తారు. ఆ విగ్నేశ్వరునికి ఇష్టమైన నైవేద్యాలను తాయారు చేస్తారు. భక్తి శ్రద్దలతో ఆ గణనాధుణ్ని పూజిస్తారు. అయితే వినాయకుని ప్రతిమని ప్రతిష్టించడంతో ప్రారంభమైన ఈ పండుగ నిమజ్జనంతో పూర్తవుతుంది. నది, కాలువ, చెరువు ఇలా నీటివనరులు దగ్గరగా ఉన్న వాళ్ళు గణేష్ ప్రతిమని నీరు ఉన్న వనరుల దగ్గరకి తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. మరి ఆ అవకాశం లేని వాళ్ళు నిమజ్జనం చేయడానికి ఎంతగానో ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. కానీ అలా వ్యయప్రయాసలకు గురి కాకుండా ఇంట్లోనే వినాయకుని ప్రతిమను నిమజ్జనం చేయొచ్చు. ఎలా చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Read also:Ganesh chathurthi: ఈ మంత్రం చెప్తూ గణేష్ నిమజ్జనం చేస్తే 100 శాతం పూజాఫలం
విగ్నేశ్వరున్ని నిమజ్జనం చేసే రోజు కూడా యధావిధిగా పూజ చేసి నైవేద్యం సమర్పించాలి. అనంతరం ఇంట్లో అందరూ తీర్ధ ప్రసాదాలు సేవించాలి. ఇప్పుడు 5 తమాలపాలకులు తీసుకుని ఒక పసుపు పూసిన దారానికి కట్టాలి. ఆ దారాన్ని నిమజ్జనం చేసే వాళ్ళు చేతికి కట్టుకోవాలి. కాగా ఇంట్లో నిమజ్జనం చెయ్యాలి అనుకున్నప్పుడు దీపం కొండకెక్కక ముందే చెయ్యాలి. అందుకు ముందుగా ఇంటి ఆవరణలో ముగ్గు వెయ్యాలి. శుచిగా ఉన్న ఒక బకెట్ లేదా టబ్బు ని తీసుకోవాలి. తరువాత బకెట్ లేదా టబ్బుని ముగ్గులో పెట్టాలి. ఇప్పుడు ఆ బకెట్ లేదా టబ్బులో నీళ్లు పొయ్యాలి. అనంతరం ఆ నీళ్లలో పసుపు, కుంకుమ, అక్షంతలు వెయ్యాలి.
Read also:Immersion of Ganesh idol : వినాయకుని విగ్రహాలు ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసా..?
ఇప్పుడు గణేశునికి నమస్కరించి మండపంలో నుండి ప్రతిమని తీసుకోవాలి. “శ్రీ గణేశం ఉద్వాసయామి.. శోభనార్థం పునరాగమనాయచ” అనే మంత్రాన్ని జపిస్తూ రెండు చేతులతో వినాయకుని ప్రతిమని నీటిలో వదలాలి. ఎప్పుడు వినాయకుని ప్రతిమని విసిరేయకూడదు. నిదానంగా రెండు చేతులతో నీటిలో కలపాలి. అలా నిమజ్జనం చేసాక ప్రతిమ పూర్తిగా నీటిలో కరిగిపోయాక రావి చెట్టుకి లేదా మారేడు చెట్టుకి పోయాలి. పసుపు గణపతిని ఏదైనా చెట్టు మొదట్లో పెట్టాలి. కానీ తులసి చెట్టు మొదట్లో పెట్టకూడదు. ఎందుకంటే తులసి దేవికి విగ్నేశ్వరుడు ఇచ్చిన శాపం కారణంగా తులసిని వినాయకుని పూజకు వాడకూడదు. అలానే తులసి చెట్టు దగ్గర వినాయకుణ్ణి ఉంచకూడదు. అలానే వినాయకుని పూజలో ఉపయోగించిన ఆకులు, పువ్వులు మొదలైన వాటిని గొయ్యి తీసి పాతి పెట్టాలి.