NTV Telugu Site icon

Homam: హోమాలు ఎందుకు చేస్తారు? నిజంగానే మంచి జరుగుతుందా?

Homam

Homam

గృహప్రవేశం చేసినప్పుడు, పెళ్లి జరిగినపుడు, ఏదైనా సమస్యలు ఉన్నా హోమాలను చేస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. ఇక దేవాలయంలో కూడా చాలామంది హోమాలు చేస్తూ ఉంటారు. అసలు హోమాలు ఎందుకు చేయాలి?.. నిజంగానే హోమాలు చేస్తే మనకు మంచి ఫలితాలు ఉంటాయా? ఇలాంటి సందేహాలు చాలా మందికి ఉంటుంది.. హిందూ మత విశ్వాసం ప్రకారం హోమానికి చాలా ప్రత్యేకత ఉంది. ఎవరి జాతకంలో అయిన దోషం ఉంటే దానికి పరిహారంగా హోమాన్ని చేస్తారు. అప్పుడు కచ్చితంగా దోషానికి పరిహారం వలన మంచి ఫలితం ఉంటుంది. అలాగే చాలామంది సకాలంలో వర్షాలు కురవాలని కూడా హోమాన్ని చేస్తుంటారు.. అయితే ఈ హోమాలను చెయ్యడం వల్ల నిజంగానే ఫలితాలు ఉంటాయా అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఒక్కో సమస్యకు ఒక్కో హోమం చేస్తారు.. సకాలంలో వర్షాలు కురవాలని కూడా హోమాన్ని చేస్తుంటారు.. ఆర్థిక సమస్యలు ఉన్నవారు కూడా గణపతి హోమాన్ని చేస్తూ ఉంటారు. అంతేకాకుండా శివ హోమాన్ని కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. పెళ్లిళ్లు క్యాన్సల్ అయిన శివ హోమం చేస్తూ ఉంటారు. ఇక విద్యలో వెనుకబడినట్లైతే సరస్వతీదేవి హోమాన్ని చేస్తారు. ఇక దక్షిణామూర్తి హోమం, విద్యా గణపతి హోమం, సిద్ధి గణపతి హోమాలని కూడా చాలామంది చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది ఎదుటివాళ్ల నుండి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని మహా సుదర్శన హోమాన్ని చేస్తూ ఉంటారు..

అలాగే లక్ష్మీ దేవిని ఆహ్వానిస్తూ కుబేర లక్ష్మి హోమాన్ని చేసుకుంటే మన ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ హోమం చేయడం వలన ఆర్థిక బాధలు కూడా ఉండవు. ఇక చాలామంది ధన్వంతరి హోమం కూడా చేస్తూ ఉంటారు. ఈ హోమం చేయడం వలన వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చు. ఈ హోమం చేస్తే అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. అందుకే చాలామంది ఇలా హోమాలతో చక్కటి పరిష్కారం కనబడుతుందని ప్రతి ఒక్కరు కూడా హోమాన్ని జరుపుతూ ఉంటారు.. ఇలా ఒక్కో సమస్యకు ఒక్కో హోమాన్ని చేస్తారు.. ఫలితాలు కూడా ఉంటున్నాయని పండితులు చెబుతున్నారు..