Site icon NTV Telugu

Guru Purnima 2025: ఈశా యోగా సెంటర్‌లో సద్గురు సత్సంగం.. ఆధ్యాత్మిక కార్యక్రమాలు..!

Guru Purnima 2025 (1)

Guru Purnima 2025 (1)

Guru Purnima 2025: ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న సాధకులకు, ఆషాఢ పూర్ణిమ లేదా గురు పూర్ణిమ అనేది సంవత్సరంలో అత్యంత ముఖ్యమైన రోజులలో ఒకటి. ఆదియోగి మొదట ఆదిగురువుగా మారి తన ఏడుగురు శిష్యులైన సప్త ఋషులకు యోగ శాస్త్రాలను అందించిన పవిత్రమైన రోజు. ఇది భారతదేశంలో పవిత్రమైన గురు శిష్య పరంపర ప్రారంభాన్ని సూచిస్తుంది. అప్పటి నుండి, గురు పూర్ణిమ మన గురువులకు కృతజ్ఞతలు తెలియజేసే ఒక గొప్ప అవకాశంగా ఉంటూ వస్తోంది. దీన్ని భారతదేశమంతటా చాలా ఆనందంతో ఇంకా భక్తితో జరుపుకుంటారు.

కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌, సద్గురు ఆశ్రమంలో, మెడిటేటర్లు ఇంకా మరిన్ని ఆశ్రమవాసులు ఈ ఏడాది జూలై 10న గురు పూర్ణిమని జరుపుకుంటున్నాయి. ఈ సంవత్సరం కార్యక్రమాలు, సంబరాల విశేషాలను ఇక్కడ చూద్దాం..

సద్గురు అర్పణం:
ఈ ఏడాది మొదటిసారిగా, సద్గురు అర్పణం అనే ఏడు రోజుల ఆన్‌లైన్ సాధనని అందిస్తున్నారు. ఇది పవిత్రమైన గురు పూర్ణిమ రోజున ముగుస్తుంది. ఇందులో పాల్గొనేవారు ప్రత్యేకమైన గురు పూర్ణిమ మంత్రం, ధ్యానలింగానికి పవిత్రమైన సమర్పణతో సాధనని ముగిస్తారు.

ధ్యానలింగం వద్ద పూర్ణిమ సమర్పణలు:
భక్తులు ధ్యానలింగంలో క్షీరార్పణం (పాల అర్పణ), జలార్పణం (నీటి అర్పణ) సమర్పించవచ్చు. క్షీరార్పణం సాధారణంగా ఉదయం (6 AM నుండి 1 PM వరకు) అందిస్తారు. జలార్పణం మధ్యాహ్నం అలాగే సాయంత్రం (1 PM నుండి 8 PM వరకు) అందిస్తారు. ప్రతి అమావాస్య లేదా పౌర్ణమి రోజు ధ్యానలింగానికి క్షీరార్పణం, జలార్పణం అర్పించి.. దాని శక్తితో అనుసంధానమై ధ్యానలింగ అనుగ్రహాన్ని పొందే శక్తివంతమైన అవకాశాన్ని అందిస్తుంది. ఇది గురు పూర్ణిమన రోజున భక్తులు గురువుతో తమ అనుబంధాన్ని మరింత గాఢతరం చేసుకోవడానికి ఇదొక అరుదైన అలాగే పవిత్రమైన అవకాశం.

గురు పూర్ణిమ సంబరాలు:
ఈసారి కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో జరుగుతున్న గురు పూర్ణిమ సంబరాలలో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. చాలా కాలంగా ఎదురుచూస్తున్న సద్గురుతో ప్రత్యేక సత్సంగం. సాయంత్రం 7 గంటల నుండి ప్రారంభమైయ్యే ఈ సత్సంగంలో సద్గురుచే శక్తివంతమైన గైడెడ్ ధ్యానం ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఈశా సంగీత బృందం సౌండ్స్ ఆఫ్ ఈశాతో కలిసి ప్రసిద్ధ కళాకారుల అద్భుతమైన ప్రదర్శనలు, మోహిత్ చౌహాన్, రామ్ మిర్యాల, పార్థివ్ గోహిల్, స్వగత్ రాథోడ్ వంటి ప్రసిద్ధ కళాకారుల ప్రదర్శనలు జరగనున్నాయి. ఉత్సాహభరితమైన ప్రపంచ స్థాయి ప్రదర్శన అందిచేందుకు త్రినిదాదియన్ సోకా కింగ్ మాచెల్ మాంటానో కూడా ఇందులో పాల్గొంటున్నారు.

సద్గురు సత్సంగం లైవ్‌స్ట్రీమ్:
వ్యక్తిగతంగా హాజరు కాలేని వారు సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానల్స్ లేదా ఎంపిక చేసిన ఈశా స్థానిక కేంద్రాలలో గురు పూర్ణిమ సత్సంగం లైవ్‌స్ట్రీమ్‌లో చేరవచ్చు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మరాఠీ, బెంగాలీ, మలయాళం, గుజరాతీ, ఒడియా, నేపాలీ ఇంకా ఇతర ప్రపంచ భాషలలో కూడా లైవ్‌స్ట్రీమ్ అందుబాటులో ఉంటుంది.

Exit mobile version