NTV Telugu Site icon

Ganesh Pooja : వినాయకుడికి పొరపాటున కూడా ఈ వస్తువులు సమర్పించకండి..

Vinayakusu

Vinayakusu

వినాయకుడు ఆది దేవుడు.. ఆయనను ముందుగా పూజిస్తారు.. బుధవారం ఆయనకు ఇష్టమైన రోజు.. ఈరోజు గణపతిని భక్తితో పూజిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని నిపుణులు చెబుతున్నారు. వినాయకుడి పూజకు ప్రత్యేక నియమాలు ఉన్నాయి. వాటిని పాటించడం చాలా అవసరం. మన కష్టాలను తొలగించి, కోరుకున్న కోరికలను తీర్చడానికి గణేశుడిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్నిటిని దేవుడికి సమర్పిస్తారు.. పొరపాటున కూడా కొన్ని వస్తువులను సమర్పించకూడదు.. అవేంటో తెలుసుకుందాం..

శివుడిలాగే తులసి కూడా వినాయకుని పూజలో నిషేధించబడింది. తులసి ఆకులను గణపతి పూజలో లేదా ప్రసాదంలో పెట్టరు. ఎందుకంటే గణేశుడు తులసిని శపించాడు. అలాగే తన పూజలో తులసి ఆకులను తీసుకోవద్దని హెచ్చరించాడట.. అందుకే ఒక్క వినాయక చవితి నాడు మాత్రమే తులసి పూజలో కనిపిస్తుంది..

ఒకసారి చంద్రుడు వినాయకుడిని వెక్కిరించాడు… అప్పుడు కోపం వచ్చి చంద్రుడు తన అందాన్ని కోల్పోతాడని వినాయకుడు శపించాడని అంటారు. అందుకే గణపతి పూజలో తెల్లటి చందనం, తెల్లని వస్త్రం, తెల్లటి పవిత్ర దారం మొదలైనవి సమర్పించకూడదు..

ఇకపోతే అక్షింతలు పాడైపోనిది లేదా పునరుద్ధరించదగినది. గణేశుని పూజలో విరిగిన అక్షింతలను ఉపయోగించవద్దు. పూర్తిగా ఉన్న బియ్యాన్ని మాత్రమే ఉపయోగించాలి.. వినాయకుడికి కోపం ఎక్కువ అన్న విషయం తెలిసిందే..

వినాయకుని పూజలో వాడిపోయిన పువ్వులు, దండలు ఉపయోగించడం నిషిద్ధం. వాటిని పూజలో ఉపయోగించడం.. లేదా ఆలయాలు, మండపాలలో పెట్టడం వలన వాస్తు దోషాలు కూడా ఏర్పడతాయి..

వినాయకుడిని పూజించే పూజలో బంతిపూలు, ఎర్రటి పువ్వులు సమర్పించవచ్చు.. వాటితోనే పూజలు చెయ్యాలి.. ఈ విషయాలను assalu మర్చిపోకండి..