Ganesh Chaturthi 2025: ఈ నెల 27 దేశవ్యాప్తంగా వినాయక చవితి ప్రారంభం కానుంది. ఈ మేరకు నెల రోజుల నుంచే చిన్నా పెద్ద తేడా లేకుండా అంతా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి పెద్ద ఎత్తున చేసుకుంటాం. ఉత్సవాల నేపథ్యంలో పోలీసులు ఎప్పటి కప్పుడు ఆంక్షలు పెడుతూనే ఉంటారు. మండపాలు ఏర్పాటు చేసుకునే వాళ్లకు తెలంగాణ పోలీసులు కీలక సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు. అందుకు గానే తెలంగాణ పోలీసు అధికారిక వెబ్‌సైట్‌లో మండపాల నిర్వాహకుల పేర్లు నమోదు చేసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు.
READ MORE: SBI Robbery : క్యాషియరే కన్నం వేశాడు.. చెన్నూరు ఎస్బీఐ-2 బ్రాంచ్ చోరీలో అసలు డ్రామా
ఇప్పటికే.. ఆయా జిల్లాలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీలు ఆదేశాలు జారీ చేస్తున్నారు. డీఎస్పీలు, సీఐలతో సమీక్ష సమావేశం నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు. విగ్రహాల ప్రతిష్ఠాపన విషయంలో నిర్వాహకులతో ముందుగానే సమావేశాలు ఏర్పాటు చేయాలని, ఎక్కడా శాంతిభద్రతల సమస్య తలెత్తనివ్వొద్దని జిల్లా ఎస్పీలు చెబుతున్నారు. మండపాల్లో డీజే ఏర్పాటుకు అనుమతి లేదని ఇప్పటికే తేల్చి చెప్పేశారు. ప్రతి మండప నిర్వాహకుల వివరాలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు సూచించారు. మరోవైపు.. ఆయా మండలాల్లో వినాయక మండపాల నిర్వాహకులతో ఎస్సై, సీఐలు మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు. డీజేలకు అనుమతి లేదని కండీషన్లు పెడుతున్నారు.
READ MORE: Saipallavi : శ్రీలీల, కృతిశెట్టి, భాగ్య శ్రీ.. సాయిపల్లవిని చూసి నేర్చుకోండి..
కాగా.. ప్రజలు, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగే ప్రాంతాల్లో మండపాలు ఏర్పాటు చేయవద్దు. విద్యుత్, ఇతర ఉపకరణాలతో అగ్నిప్రమాదాలు తలెత్తకుండా జాగ్రత్తపడాలి. విద్యుత్ నియంత్రికల సమీపంలో మండపాలు ఏర్పాటు చేయడం శ్రేయస్కరం కాదు. విద్యుత్ సరఫరా కోసం సంబంధిత శాఖ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. మండపాల వద్ద డీజే శబ్దాలతో స్థానికులను ఇబ్బందులకు గురిచేయవద్దు. నిమజ్జనం రోజున డీజేలకు అనుమతి లేదు. పోలీసుల సూచనల మేరకు తగిన సౌండ్ సిస్టమ్ ఏర్పాటుచేసుకోవాలి. నిమజ్జనం సందర్భంలో ప్రమాదాలు తలెత్తకుండా చెరువులు, కుంటల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
