NTV Telugu Site icon

Friday : లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే శుక్రవారం ఇలా చెయ్యాల్సిందే?

Lashmi

Lashmi

ఈరోజుల్లో చాలా మంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు.. ఎంత సంపాదించిన చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండటం లేదని చాలా మంది బాధపడుతూ ఉంటారు.. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం రకరకాల నియమాలు పరిహారాలు వాస్తు చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఫలితం లభించక దిగులు చెందుతూ ఉంటారు. అయితే చాలామంది సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని అమ్మవారు ఆశీస్సులు పొందాలని ఎన్నెన్నో పూజలను చేస్తుంటారు.. ఆ పూజలెంటో ఇప్పుడు తెలుసుకుందాం..

శుక్రవారం లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజించాలి. అమ్మవారిని పూజించే ముందు తెలుపు లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించి ఒక చిన్న పాటి వస్త్రంపై లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచి గులాబీలు అక్షింతలు నెయ్యి తేనే పువ్వులు మొదలైన వాటిని ఉపయోగించి లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించాలి. అదేవిధంగా శుక్రవారం రోజు లక్ష్మిదేవి అనుగ్రహం కోసం ఒక పటించడం చాలా మంచిది… అమ్మవారి మంత్రాన్ని కూడా పాటించాలి..

ఆ మంత్రం ఏంటంటే..ఓం ద్రాం ద్రీం ద్రౌం సః శుక్రాయ నమః” అనే ఈ మంత్రం శుక్ర గ్రహం శుభదృష్టితో చూసేలా చేస్తుంది. ఫలితంగా ఇంట్లో సిరి, సంపదలు నెలకొంటాయి. అలాగే శుక్రవారం రోజు మొక్కలు నాటడం వల్ల సంపద శ్రేయస్సు లభిస్తాయి. ఒక కుండీలో ఏదైనా ఒక కొత్త మొక్కను నాటాలి. మొక్క చనిపోకుండా లేదా ఎండిపోకుండా చూసుక కోవాలి. ఈ మొక్క పెరిగేకొద్దీ మీ ఇంటి పురోగతి కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. శుక్రవారం రోజుల్లో డబ్బు దానం చేయడం కూడా శుభప్రదంగా పరిగణించాలి.. ఇంకా పేదలకు మీకు తోచిన సాయాన్ని చెయ్యడం మంచిది.. సాయం చేసిన విషయాన్ని రహస్యంగా ఉంచడం మంచిది..