NTV Telugu Site icon

Mahashivratri 2025: శివుడి పూజ చేసేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు.. పూజా ఫలితం దక్కదు!

Mahashivratri 2025

Mahashivratri 2025

రేపే మహా శివరాత్రి. ఇది పరమేశ్వరుడి భక్తులందరికీ అత్యంత ఇష్టమైన రోజు. అంతే కాకుండా జ్యోతిష్య ప్రకారం కూడా చాలా కీలకం. ఉచ్ఛ స్నథితిలో శుక్రుడు, మీన రాశిలో బుధుడు, వృషభరాశిలో పరివర్తన చెందిన గురువు, కుంభ రాశిలో రవి, శని రాశులు మహా శివరాత్రి నుంచి సంచారం చేయనున్నాయి. ఈ రోజున భక్తులు శైవ క్షేత్రాలకు పరుగులు తీస్తుంటారు. శివుడికి అభిషేకాలు చేస్తుంటారు. కానీ.. శివుడి పూజించేటప్పుడు కొన్ని నియమాలు తప్పక పాటించాలట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

తులసిని వాడొద్దు..
శివునికి తులసితో పూజ చేయొద్దట. హిందువులు తులసి ఆకును ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ చెట్టుకు రోజు పూజలు చేస్తారు. అలాంటిది శివుడికి మాత్రం తులసి ఆకులతో పూజ చేయకూడదని చెప్తున్నాయి శాస్త్రాలు. దీనికి రెండు కారణాలు ఇవే..
* సాధారణంగా తులసి ఆకులను లక్ష్మీ దేవిగా భావిస్తారు. లక్ష్మీదేవి విష్ణుమూర్తి అర్ధాంగి కాబట్టి శివలింగానికి తులసి ఆకులతో పూజలు చేయకూడదని కొందరు పండితులు చెబుతున్నారు.
*తులసి గత జన్మలో బృందా. ఆమె భర్త అయిన జలంధర్ శివుని ఆగ్రహానికి లోనై ప్రాణాలు విడిచాడు. ఈ నేపథ్యంలో శివుని ఆరాధనకు తనను ఉపయోగించవద్దని తులసి నిరాకరించిందని శాస్త్రాలు చెబుతున్నాయి.

కొబ్బరి నీళ్లు, కుంకుమ సమర్పించొద్దు..
హిందువులు ఏ ఆలయానికి వెళ్లినా, ఏ పూజలు చేసిన కొబ్బరి కాయ కొడుతుంటారు. అలాగే శివుడికి కూడా కొబ్బరికాయ కొడతారు. కానీ.. కొబ్బరి నీళ్లను శివుడికి సమర్పించరు. కొబ్బరి నీళ్లంటే శివయ్యకు ఇష్టం ఉండదట. అందుకే పరమేశ్వరుడికి సమర్పించకూడదని పురణాలు చెబుతున్నాయి. శివరాత్రి ఒక్కరోజే కాదు.. ఏ రోజు కూడా శివుడికి కుంకుమ సమర్పించకూడదట. కుంకుమ ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి.. ఎరుపు రంగు ఉద్దీపనకు కారణంగా పరిగణిస్తారు. శివుడిని పురాణాల్లో విధ్వంసకుడు అని పిలుస్తారు. కాబట్టి శివునిక పూజలో కుంకుమను నిషేధించారు. పరమేశ్వరునికి విభూది అంటే మహా ఇష్టం కాబ్టటి.. విభూదిని సమర్పించవచ్చు.

తెల్లటి పువ్వులు, శంఖం పూజలో వాడొద్దు.. ప్రదక్షిణలు చేయొద్దు..
పురణాల ప్రకారం.. తెల్లని పువ్వులంటే శివుడికి ఇష్టం ఉండదట. ఒక వేళ పెట్టాల్సి వస్తే.. మల్లెపువ్వులను శివుని దగ్గర పెట్టవచ్చని చెప్తారు. కానీ చంపా, కెన్డా, మొగలిపువ్వులను సమర్పించకూడదట. ఒకవేళ ఈ పువ్వులను పెడ్తే శివుడు శపిస్తాడాని.. అందుకే వాటిని పెట్టకూడదని పండితులు చెప్తారు. పూజలో శంఖాన్ని వినియోగించవద్దు అంటున్నారు పూజారులు. పురాణాల ప్రకారం శివుడు శంఖచూర్ణుడు అనే రాక్షసుడిని హతమార్చాడని.. అప్పటి నుంచి శంఖం అసురుని చిహ్నంగా పరిగణిస్తారని తెలుస్తుంది. అందుకే శంఖాన్ని శివుని ఆరాధనలో వినియోగించరు. శంఖచూర్ణుడు నారాయణుని భక్తుడు కాబట్టి.. ఆయన పూజలో కచ్చితంగా శంఖం వాయిస్తారు. అలాగే.. శివలింగం చుట్టూ ప్రదక్షిణలు అస్సలు చేయొద్దట. సగం వరకే తిరిగి మళ్లీ వెనక్కి వెళ్లిపోవాలని దీని సారాంశం. ఒకవేళ తెలియక తిరిగినా.. పూజా ఫలితం దక్కదని పురణాలు చెప్తున్నాయి.