Lakshmi Puja: ప్రతి ఏడాది కార్తీక అమావాస్య రోజున దీపావళి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం దీపావళి పండుగ ఈరోజు (అక్టోబర్ 20న) జరుపుకోనున్నారు. వాస్తవానికి ఈసారి దీపావళి పండుగ చాలా ప్రత్యేకంగా ఉంటుందని జ్యోతిష్కులు పేర్కొన్నారు. దాదాపు 100 ఏళ్ల తర్వాత దీపావళి నాడు మహాలక్ష్మీ రాజ్యయోగం ఏర్పడబోతోందని తెలిపారు. దీపావళి ఆనందం, ఐశ్వర్యం, కీర్తి, లక్ష్మీదేవి రాకను సూచిస్తూ చేసుకునే పండుగ. లక్ష్మీదేవిని సంపదకు పూజనీయమైన దేవతగా కొలుస్తారు. ఏటా ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష అమావాస్య నాడు జరుపుకొనే దీపావళి పండుగ రోజున భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవినీ ఆరాధిస్తారు.
Read Also: Heavy Rainfall Alert: మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన..
అయితే, దీపావళి పండగ నాడు లక్ష్మీదేవిని సరైన సమయంలో, సరైన పద్ధతిలో ఆచార వ్యవహారాలతో పూజిస్తే ఈ సంవత్సరం సర్వతోముఖంగా సుభిక్షంగా ఉంటామని భక్తులు నమ్ముతారు. మీరు పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని తీసుకొచ్చినప్పుడల్లా అది కమలం లేదా ఏనుగు మీద కూర్చోని ఉండేలా చూసుకోండి. సంపద, శ్రేయస్సుకు అధినేత్రిగా చెప్పుకునే శ్రీమహా లక్ష్మీని పూజించేటప్పుడు తప్పకుండా ఈ నియమాలు పాటించాలి.. పూజ సమయంలో ఈ తప్పులు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం లభించదు.
Read Also: Pradeep Ranganathan : ప్రదీప్ రంగనాథన్ ఆస్తులు ఎంతో తెలుసా..?
పాటించాల్సిన నియమాలు..
* సాయంత్రం వేళలో లక్ష్మీదేవి పూజను ప్రారంభించాలి..
* దీపావళి రోజు జరిపే పూజలోనూ వినాయకుడిని మొదట ఆరాధించడం సంప్రదాయం..
* దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ముందు ఇంటిని శుభ్రం చేసి రంగవల్లులతో, పూలతో, దీపాలతో అలంకరించాలి..
* పూజ గదిలో ఈశాన్య దిశలో పీఠం ఏర్పాటు చేసి ఎర్రటి వస్త్రాన్ని వేయాలి..
* ఎర్రటి వస్త్రంపై గణపతి, లక్ష్మీదేవి విగ్రహాలను ఉంచి, పీఠంపై కలశాన్ని ఏర్పాటు చేసి దీపాలు వెలిగించాలి..
* పూలు, పండ్లు, స్వీట్లు, పిండి వంటలు వంటివి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి..
* మొదట గణపతి పూజ చేసిన అనంతరం శ్రీ మహాలక్ష్మీని పూజించాలి..
