Site icon NTV Telugu

Deeparadhana: అష్టైశ్వర్యాలు కలగాలంటే ఎప్పుడూ దీపం పెట్టాలో తెలుసా?

Deepam

Deepam

భారతీయులకు దైవారాధన ఎక్కువ.. ఉదయం సాయంత్రం దేవుడికి దీపం పెట్టి పూజలు చేస్తారు.. ఎప్పుడు పడితే అప్పుడు పూజ చెయ్యకూడదు.. ఏ సమయంలో పూజ చేస్తే మంచి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

దీపారాధన ఉదయం, సాయంత్రం రెండు సమయాలలో చేయడం మంచిది. తెల్లవారుజామున, సాయంత్రం ఇలా రెండు గడియల్లో దీపారాధన చేస్తేమంచి ఫలితాలు కనిపిస్తాయి. సూర్యోదయానికి ముందు అంటే 3 నుంచి 6 గంటలలోపు సమయాన్ని అమృత ఘడియలుగా భావిస్తారు. ఎవరైతే సూర్యోదయానికి ముందు పూజ చేస్తారో వారికి శుభఫలితాలు ప్రాప్తిస్తాయి… సూర్యోదయం ముందు పూజ చేస్తే విష్ణు మూర్తి అనుగ్రహం లభిస్తుంది.. భోగ భాగ్యాలు కలుగుతాయి..

సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత ఇంట్లో, తులసికోట వద్ద దీపారాధన చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. సాయంత్రం వేళల్లో ముఖ్యంగా లక్ష్మీదేవిని ఆరాధించాలి.. అంటే ఏడు లోపు దీపం వెలిగించి పూజ చేస్తే లక్ష్మీకటాక్షం పొందుతారు. అలాగే ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో దీపారాధన చేయడం మంచిది. సాయంత్రం పూజ చేయడానికి కుదరని వారు ఉదయం చేసినా మంచి ఫలితం ఉంటుంది.. సాయంత్రం దీపం పెట్టిన వాళ్లు గుమ్మానికి ఇరువైపులా పెట్టడం కూడా మంచిదే..

దీపాన్ని ఆవు నెయ్యితో దీపారాధన చేయడం ఉత్తమం. ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది. కనుక దీపారాధనకు ఆవునెయ్యిని ఉపయోగించడం మంచిది. అలాగే దీపారాధన కోసం నువ్వుల నూనెను ఉపయోగించిన అద్భుత ఫలితాలు పొందగలుగుతారు. ఆవునెయ్యి, నువ్వుల నూనెలతో దీపారాధన చేస్తే సకల సంపదలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.. కొబ్బరి నూనె, శనగ నూనె తో అస్సలు దీపం వెలిగించారాదు.. దీపం పెట్టాకా కొండేక్కేంతవరకు దేవుడి గది తలుపులు వెయ్యరాదు..ఇవన్నీ గుర్తు పెట్టుకొని దీపం పెడితే శుభ ఫలితాలు కలుగుతాయి..

Exit mobile version