Karthika Deepam: హిందూ ధర్మంలో దీపారాధనకు ప్రత్యేక స్థానం ఉంది. దీపం జ్యోతిః పరబ్రహ్మ దీపంజ్యోతిః నమో నమః, దీపేన హరతేపాపం దీప దేవి నమో నమః అనే శ్లోకం దీపం పరబ్రహ్మ స్వరూపమని, పాపాలను హరించే శక్తి దీనికి ఉంటుందని తెలియజేస్తుంది. ఈ దీపం ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగించి, సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. ప్రతి రోజు దీపారాధన చేసేవారు, శుభ ఫలితాలు పొందడానికి జ్యోతిష్యులు తెలియజేస్తున్నారు.
Read Also: Minister Nara Lokesh: తాజా రాజకీయ పరిణామాలపై మంత్రి లోకేష్ సీరియస్..! మీరు ఏం చేస్తున్నారు..?
ప్రమిదుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
* దీపారాధనలో మంచి ఫలితాలు రావలంటే మీరు వెలిగించే ప్రమీదుల పరిమాణం మీ వయస్సుకు తగినట్లుగా ఉండాలి..
* మూడు అంగుళాల ఎత్తున్న ప్రమిదల్లో చిన్నపిల్లలు దీపం వెలిగించాలి..
* 30 సంవత్సరాల లోపు యువకులు, యువతులు ఆరు అంగుళాలలోపు ఎత్తున్న ప్రమిదలను ఉపయోగించాలి.
* 50 సంవత్సరాల పైబడిన వారు 6 నుంచి 9 అంగుళాల కుందులలో దీపారాధన చేయాల్సి ఉంటుంది.. అయితే, మీ వయసు పెరిగే కొద్దీ దీపారాధన ప్రమిదుల సైజ్ పెరిగితే అనుకూల ఫలితాలు లభిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
Read Also: Kohli Breakup Story: విరాట్ కోహ్లీ, అనుష్క “బ్రేకప్”.. ఈ జంటను కలిపిన నటుడు ఎవరో తెలుసా..?
దీపారాధన చేసేటప్పుడు పాటించే నియమాలు
* మనం ఉపయోగించే వస్తువులు, వెలిగించే పద్ధతి కూడా శుభాలని కలిగిస్తాయి..
* దీపం వెలిగించడానికి ఉపయోగించే నూనె కొబ్బరి నూనెలాగా పల్చగా ఉండాలి..
* నూనె చిక్కగా, ఆముదం వలె ఉంటే పనులు కూడా ఆలస్యంగా జరుగుతాయని, పల్చగా ఉంటే తొందరగా పనులు పూర్తవుతాయని సూచనలు..
* ప్రమిదల్లో ఉపయోగించే వత్తులు కూడా ఎప్పుడూ నల్లగా, మురికిగా ఉండొద్దు, పాలలాంటి తెలుపు రంగులో ఉండేటివి మాత్రమే ఉపయోగించాలి..
* ఎన్ని వత్తులతో దీపం వెలిగించినా, ముందుగా ప్రమిదల్లో నూనె పోసి రెండు వత్తులను మాత్రం కలిపి ఒక వత్తిగా పెట్టిన తర్వాతే మీకు నచ్చిన సంఖ్యలో వత్తులను వెలిగించుకోవచ్చు..
Read Also: Women’s Team to Meet PM: నేడు మోడీని కలవనున్న భారత మహిళల క్రికెట్ ప్లేయర్స్..
దీపం పెట్టే దిశ:
* నువ్వుల నూనెతో దీపం పెడితే దేవుడికి ఎడమ వైపుగా పెట్టాలి..
* ఆవు నెయ్యితో దీపం పెడితే భగవంతుడికి కుడి వైపున వెలిగించాలి..
* శివుడి విగ్రహం లేదా చిత్రపటానికి ఎడమ వైపు మాత్రమే దీపారాధన చేయాల్సి ఉంటుంది..
* శ్రీ మహా విష్ణువుకు కుడి వైపున మాత్రమే దీపం వెలిగించాల్సి ఉంటుంది..
* అమ్మవారి ఫొటోకు ఎదురుగా దీపారాధన చేస్తే మంచింది.
ముఖ్య జాగ్రత్తలు:
* దీపం వెలిగించిన తర్వాత ప్రమిదలను ఎట్టి పరిస్థితులల్లో కదిలించొద్దు..
* ఒక్కసారి దీపం కొండెక్కిన తర్వాత, ప్రమిదులను శుభ్రం చేయకుండా మళ్లీ దీపం వెలిగించొద్దు..
* ప్రమిదుల నుంచి నూనె బొట్లుగా కారకుండా చూడాలి, కుందులకు బొట్టు పెట్టేటప్పుడు కుంకుమ నూనెలో పడకుండా జాగ్రత్త వహించాల్సి ఉంది.
* మధ్యాహ్నం సమయంలో దీపారాధన చేయొద్దు.. అయితే ఈ నియమం ఆలయాల్లో దీపం వెలిగించేటప్పుడు మాత్రం వర్తించదు. కావునా, మీరు ఇంట్లో ఈ నియమాలు పాటిస్తూ దీపారాధన చేస్తే, విశేషమైన మంచి ఫలితాలు లభించి, మీ ఇల్లు సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యములను కలిగి ఉంటారని జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు.
గమనిక: పైన ఇవ్వబడిన దీపారాధన నియమాలు మరియు జ్యోతిష్య, ఇంటర్నెట్ ద్వారా పలు వార్తా కథనాల ద్వారా సేకరించబడినవి. వీటిని పాటించే ముందు లేదా ఆచరించే సమయంలో, మీరు సంబంధిత జ్యోతిష్యులను, ధార్మిక పండితులను లేదా వేద పారంగతులను సంప్రదించి, వారి సలహా మేరకు పాటించవలసిందిగా సూచించడమైనది. ఈ వార్తకు ఎన్టీవీ తెలుగు.కామ్ కి ఎలాంటి సంబంధం లేదు..
