NTV Telugu Site icon

Dakshin Ke Badrinath: హైదరాబాద్‌లో కొలువైన బద్రీనాథుడు.. ఈ ఆధ్యాత్మిక ప్రదేశం గురించి మీకు తెలుసా?

Dakshin Ke Badrinath

Dakshin Ke Badrinath

Dakshin Ke Badrinath Bhakti Tv Video: హిందువులలో చాలా మందికి ఎక్కడో ఉన్న బద్రీనాథ్ వెళ్లాలని ఉంటుంది. కానీ వయసు సహకరించకో, ఆరోగ్య సమస్యల వలనో లేక ఆర్ధిక ఇబ్బందులు కారణంగానో అక్కడ దాకా వెళ్లలేకపోతున్నారు. అలంటి వారికోసం ఆ బద్రినాథుడు హైదరాబాద్‌కు వచ్చేశారని అంటే నమ్ముతారా? నమ్మక పోయినా అదే నిజమండీ హైదరాబాద్ దగ్గరలో నూతన బద్రీనాథ్ ఆలయం నిర్మించారు. ఉత్తరాఖండ్ లో ప్రసిద్ధి చెందిన బద్రీనాథ్ ఆలయానికి ఒక రెప్లికాలాగా ఈ హైదరాబాద్ బద్రీనాథ్ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం హైదరాబాద్‌ నుంచి 40 కి.మీ దూరంలో మేడ్చల్ జిల్లా, బండమైలారం అనే చిన్న గ్రామంలో నిర్మించబడింది. జూన్ 29న ఓపెన్ అయిన ఈ ఆలయాన్ని దక్షిణ్ కే బద్రీనాథ్ అని పిలుస్తున్నారు. ఈ ఆలయంలో కొద్దిరోజుల నుంచి నుంచి బద్రీనాధుడు పూజలు అందుకుంటున్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఆలయంలో బద్రీనాథ్ క్షేత్రంలో చేసే పూజా విధానాన్ని అవలంబిస్తున్నారు.

Minister RK Roja: పవన్ కళ్యాణ్‌కి ఫ్యాన్స్ ఉంటే, జగన్‌కు సైన్యముంది.. మంత్రి రోజా కౌంటర్

ఇక దాదాపు 30,000 మంది NGO సభ్యులతో ఉత్తరాఖండ్ కళ్యాణకారి సంస్థ ఈ ఆలయాన్ని 1,550 చదరపు గజాలలో నిర్మించిగా ఈ నిర్మాణం కోసం విరాళాల ద్వారా దాదాపు కోటి రూపాయలు స్వీకరించినట్లు సభ్యులు చెబుతున్నారు. నిజానికి ఉత్తరాఖండ్‌లో ఉన్న బద్రీనాథ్ ఆలయం సంవత్సరానికి నాలుగు నెలలు (మే నుండి జూన్, సెప్టెంబర్ నుండి అక్టోబర్) మాత్రమే తెరిచి ఉంటుంది కానీ మన ఈ దక్షిణ్ కే బద్రీనాథ్ ఆలయం సంవత్సరం పొడవునా తెరిచి ఉంటుంది. ఈ దక్షిణ్ కే బద్రీనాథ్ ఆలయంలోని ప్రతిమలు అసలు బద్రీనాథ్ ఆలయంలో ఎలా ఉన్నాయో అలాగే ప్రతిష్టించడమే కాదు ఆ ఆలయంలో ఉన్న అఖండ దీపాన్ని సైతం బద్రీనాథ్ నుంచి తీసుకొచ్చారు. మరి అలాంటి దేవాలయం గురించి మా భక్తి ఛానల్ చేసిన స్పెషల్ వీడియో మీరు కూడా చూసేయండి మరి.