కన్యా రాశి వారికి ఈరోజు కలిసిరానుంది. ఆకస్మిక ధన లాభాలు కలిసి వస్తాయి. నూతనమైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంటారు. ముఖ్యమైన కార్యక్రమాలను రూపొందించుకుంటారు. వివిధ రూపాల్లో అద్భుతమైన విజయాలను సాధిస్తారు. ఈరోజు కన్యా రాశి వారికి అనుకూలించే దైవం.. శ్రీ గాయత్రీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ.. గాయత్రీ అమ్మవారి ధ్యాన శ్లోకమును పారాయణం చేయండి.
వృశ్చిక రాశి వారికి ఈరోజు ప్రయాణాల్లో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆకస్మికంగా ఆర్థిక నష్టాలు కలగకుండా జాగ్రత్త పడాలి. అనారోగ్య బాధలు పెరగకుండా ఎప్పటికప్పుడు వైద్యపరమైన సూచనలు, సలహాలు తీసుకోవడం మంచిది. పుణ్యక్షేత్రాలు లేదా తీర్థయాత్రలకు రూపకల్పన చేసుకుంటారు. అనుకూలించే దైవం.. శ్రీ శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ.. విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి. శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ నేటి రాశి ఫలాలను అందించారు.
