Chardham Templs: శీతాకాలం దృష్ట్యా ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ జ్యోతిర్లింగ కేదార్‌నాథ్ ఆలయ తలుపులను బుధవారం మూసివేశారు. సంప్రదాయం ప్రకారం ఉదయం 8.30 గంటలకు వేద మంత్రోచ్ఛరణల మధ్య పండితులు మహాద్వారాన్ని మూసివేశారు. ఎముకలు కొరికే చలిలో ఈ కార్యక్రమంలో 2500 మంది భక్తులు పాల్గొన్నారు. పంచముఖి డోలీలో కేదారేశ్వరుడిని ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయానికి తీసుకెళ్లారు. దాదాపు 6 నెలల పాటు కేదార్‌నాథ్‌ని అక్కడ పూజిస్తారు. ఈ ఏడాది 19.5 లక్షల మందికి పైగా భక్తులు కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించినట్లు బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ అజేంద్ర అజయ్ తెలిపారు. చార్ధామ్‌లోని ప్రధాన పుణ్యక్షేత్రమైన యమునోత్రిని కూడా బుధవారం ఉదయం 11.30 గంటలకు మూసివేసి భక్తుల దర్శనాన్ని నిలిపివేశారు. యమునా దేవిని ఉత్తరకాశీలోని ఖర్సాలీలోని కుషిమఠానికి తీసుకెళ్లారు. మంగళవారం గంగోత్రిని మూసివేశారు. చివరికి బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 18న మూసివేయనున్నారు. అదే సమయంలో కేదార్ నాథ్ పరిసర ప్రాంతాల్లో మంచు కరిగిపోయి చలి గాలులు వీస్తున్నాయి. చార్ధామ్ దేవాలయాలు ప్రతి సంవత్సరం అక్టోబర్-నవంబర్ నుండి ఏప్రిల్-మే వరకు మూసివేయబడతాయి.
ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా కేదార్‌నాథ్‌ని సందర్శించాలని కోరుకుంటాడు. హిమాలయాల మధ్యలో ఉన్న పవిత్ర ఆలయానికి చేరుకోవడం అంత సులభం కాదు. ఇది ఒక అందమైన, ప్రమాదకరమైన ప్రయాణం. అక్కడికి చేరుకుని స్వామిని దర్శించుకుంటే జన్మజన్మల పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. కానీ, అక్కడికి చేరుకునే మార్గం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు పరిస్థితి కాస్త మెరుగ్గా మారింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. హిమాలయాల దిగువన ఉండడం వల్ల అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చెప్పలేం. ఊహించని వరదలు, ఎన్నో ప్రమాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 2013లో కూడా ఇదే తరహాలో ఆకస్మిక వరద వచ్చి 10,000 మందికి పైగా భక్తుల ప్రాణాలు తీసింది. మందాకిని మహోగ్ర రూపాన్ని ధరించింది.
CWC 2023 India Final: భారత్ ప్రపంచకప్ ఫైనల్‌కు వెళ్లడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా!
