Site icon NTV Telugu

భక్తి టీవీ కోటి దీపోత్సవం నాల్గవ రోజు.. కార్యక్రమాలివే!

భక్తి టీవీ కోటిదీపోత్సవం నాల్గవ రోజుకి చేరుకుంది. కార్తీక మాసాన భక్తి టీవీ కోటిదీపోత్సవం ఆధ్యాత్మిక వెలుగులు విరజిమ్ముతోంది. వేలాదిమందిని భక్తిపారవశ్యంలో ఓలలాడిస్తోంది. నాల్గవ రోజు కార్తీక సోమవారం కావడంతో భక్తులు భారీగా తరలిరానున్నారు. ఇవాళ్టి కార్యక్రమాల్లో శ్రీ ప్రకాశనందేంద్ర సరస్వతి స్వామి, శ్రీ అవధూతగిరి మహారాజ్, మహంత్ శ్రీసిద్ధేశ్వరానందగిరి మహారాజ్, బర్దీపూర్, శ్రీలలితా పీఠం శ్రీ స్వరూపానందగిరి అనుగ్రహ భాషణం వుంటుంది.


అనంతరం బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనామృతం వుంటుంది. వేదికపై పూజలో భాగంగా రాహుకేతు పూజ, భక్తులచే నాగపడగలకు రాహుకేతుపూజల జరుగుతుంది. ఇవాళ్టి కోటి దీపోత్సవంలో శ్రీకాళహస్తీశ్వర కల్యాణం వుంటుంది. అనంతరం గజవాహనం, సింహవాహనం వుంటుంది. అందరూ ఆహ్వానితులే. వేదిక ఎన్టీఆర్ స్టేడియం, హైదరాబాద్‌.

Exit mobile version