NTV Telugu Site icon

Koti Deepotsavam LIVE: ఐదో రోజు కోటిదీపోత్సవం.. ఈరోజు ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి కల్యాణం

2

2

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా భక్తి టీవీ-ఎన్టీవీ ఆధ్వర్యంలో జరుగుతోన్న కోటిదీపోత్సవం ఐదో రోజుకు చేరింది. దీంతో ఎన్టీఆర్ స్టేడియం పరిసర ప్రాంతాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి.. కార్తీక మాసంలో జరుగుతోన్న దీపాల ఉత్సవంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ రోజు విజయవాడ శ్రీ కనకదుర్గమ్మకు కోటి గాజుల అర్చన వేదిక జరుగుతోంది. కనకదుర్గమ్మకు కోటి గాజుల అర్చన భక్తులు స్వయంగా చేపట్టారు. అటు ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి కల్యాణం అంగరంగ వైభవంగా జరుగుతోంది. అనంతరం సింహ వాహనం సేవ ఉంటుంది. వీటితో పాటు సకల శుభాలను కలిగించే సప్త హారతి ఉంటుంది. కాగా భక్తులకు పూజా సామాగ్రిని కూడా భక్తి టీవీ ఉచితంగా అందజేస్తోంది. ఎన్టీఆర్‌ స్టేడియంలో వైభవంగా సాగుతోన్న కోటి దీపోత్సవాన్ని లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియోను క్లిక్‌ చేయండి.