మన హిందూ సాంప్రదాయంలో పెళ్లికి ప్రత్యేక స్థానం ఉంది.. రెండు మనసులను మంగళ సూత్రం తో కలిపే ఈ పెళ్లికి బ్రహ్మ ముహూర్తం చూసి మూడు ముళ్ళు వేయిస్తున్నారు.. అదే విధంగా పెళ్లి కి ముందు తర్వాత కూడా ప్రతి కార్యానికి ముహూర్తం చూసే చేస్తున్నారు..పెళ్లి తర్వాత జరిగే మొదటి రాత్రి కార్యానికి కూడా ముహూర్తం చూసే వధూ వరులను గదిలోకి పంపిస్తారు.. దీని వెనుక ఉన్న కారణం ఏంటి అనేది చాలామందికి తెలియదు.. ఈరోజు మనం ఈ ముహూర్తం గురించి వివరంగా తెలుసుకుందాం..
సాధారణంగా దీనికి మంచి మహూర్తం చూడాలి కానీ పెళ్లైన రెండు మూడు రోజుల్లో జరిపించేస్తున్నారు. ఇంకొందరు పెళ్లికి ముందే తొందరపడుతున్నారు. చాలా వరకు పెళ్లి జరిగిన ఆరోజు రాత్రి ఎక్కువగా శోభనానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు..పెళ్లి తర్వాత మొదటి రోజులు గర్భాదానం పనికి రాదు. పురుష రాశులైన మేషం, మిధునం, సింహం, తులా, ధనుస్సు, కుంభంలో బృహస్పతి సంచరిస్తున్న సమయం లో గర్భాదాన లగ్నానికి లగ్న, పంచమ, నవమ స్థానాల్లో ఉన్నప్పుడు గర్భాదాన ముహూర్తం నిర్ణయిస్తే పిల్లలు కలుగుతారని అంటున్నారు.. అదే విదంగా స్త్రీల రాశులను బట్టి ముహూర్తం పెడతారట.. సంతానోత్పత్తి కోసం పెట్టే ఈ ముహూర్తం సూర్యోదయ, సూర్యాస్తమయ కాలంలో మాత్రమే పెడతారు..
భార్య భర్తల రాశికి ఎనిమిదో స్థానం లో చంద్రుడు సంచరిస్తున్నప్పుడు గర్భాదాన ముహూర్తం నిర్ణయించరాదు.. ఐదో స్థానంలో ఉన్నప్పుడే ఈ ముహూర్తన్ని పెట్టాలి..ఇప్పటి జనరేషన్ కు అటువంటి పట్టింపులు ఏమీ లేకుండా పెళ్ళికి ముందే తొందరపడతూ ఉంటారు. దీనివలన సత్సంతానం కలగడం లేదని బాధపడుతున్నారు. ఇందుకు ఒక ఉదాహరణ హిరణ్యాక్ష, హిరణ్య కశిపుడి జననం. అందుకే మంచి ముహూర్తం చూసి బృహస్పతి ఐదో స్థానం లో ఉన్నప్పుడు శుభముహూర్తం నిర్ణయిస్తారు.. అప్పుడే పుట్టబోయే పిల్లలు కూడా చాలా తెలివైన వాళ్లుగా ఉంటారని అంటున్నారు.. ఇదండి అసలు విషయం అందుకే ముహూర్తం పెడతారని అంటున్నారు..
