Bad Dreams: నిద్ర అనేది మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఒక మనిషి ఉత్సాహంగా, చురుకుగా ఉండాలంటే కచ్చితంగా నిద్ర కావాలని చెబుతుంటారు నిపుణులు. అంతటి ప్రాముఖ్యం ఉన్న నిద్ర.. కొందరికి మాత్రం కలత నిద్రగా మారుతుంది. వాస్తవానికి చాలా మంది నిద్ర పోయే టైంలో తరచుగా కలల ప్రపంచంలోకి జారిపోతారు. అక్కడ వారు వింతైన, అసాధారణమైన విషయాలను చూస్తారు. కొన్నిసార్లు వారు గాలిలో ఎగురుతున్నట్లు లేదా ఉనికిలో లేని వ్యక్తిని చూస్తున్నట్లు కలలు కంటారు. ఈ కలలో పదే పదే నల్ల పామును చూసినట్లయితే, అది ఒక పెద్ద సమస్య సమీపిస్తున్నట్లు సూచిస్తుందని కలల శాస్త్రం చెబుతుంది. తరచుగా దురదృష్టం రాకను సూచించే అలాంటి 10 కలల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: CM Revanth Reddy : మేడారం నాణ్యతా ప్రమాణాలు పాటించండి
1. కలల శాస్త్రం ప్రకారం.. రాత్రిపూట మీ కలలో మీరు పూర్తిగా చీకటిలో ఉన్నట్లు అనిపిస్తే, అది ఏదో పెద్ద విపత్తు రాబోతోందనడానికి సంకేతం.
2. కలలో నల్ల పామును చూడటం లేదా దాని కాటుకు గురికావడం అశుభ సంకేతంగా చెబుతున్నారు. కలల శాస్త్రం ప్రకారం.. ఇది తీవ్రమైన అనారోగ్యాన్ని సూచిస్తుంది.
3. కలలో బంగారాన్ని చూడటం అశుభంగా పరిగణిస్తారు. కలలో బంగారు ఆభరణాలను చూడటం గణనీయమైన ఖర్చును సూచిస్తుందని, మీకు హాని కలిగిస్తుందని సూచిస్తుంది.
4. షూ దొంగతనం జరిగినట్లు కలలు కనడం కూడా అశుభ సంకేతంగా చెబుతున్నారు. ఈ కలలు మీ ఆరోగ్యానికి నేరుగా సంబంధించినవి, అలాగే అనారోగ్యం లేదా పని అంతరాయాన్ని సూచిస్తాయని అంటున్నారు.
5. కలలో మీరు ఎత్తు నుంచి పడిపోతున్నట్లు కనిపించడం అనేది ఆర్థిక నష్టం లేదా ఆత్మవిశ్వాసం లేకపోవడాన్ని సూచిస్తుందని చెబుతున్నారు.
6. కలలో అపరిచితుడిని కలవడం పెద్ద విపత్తు సంభవించే అవకాశాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు. ఈ కల వచ్చిన తర్వాత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
7. జుట్టు రాలుతున్నట్లు కలలు కనడం చాలా అశుభకరంగా కలల శాస్త్రం వెల్లడించింది. జుట్టు రాలుతున్నట్లు కలలు కనడం డబ్బు కోల్పోవడం లేదా చెడు వార్తలు రాబోతుండటాన్ని సూచిస్తుంది.
8. కలలో చీపురు నేలపై పడి ఉండటం అశుభంగా భావిస్తారు. ఈ చీపురు కల భవిష్యత్తులో పెద్ద ఇబ్బందులను సూచిస్తుందని నమ్ముతారు.
9. కలలో పిల్లి పోట్లాడుకోవడం లేదా గుర్రుమనడం చూడటం భవిష్యత్తులో ఒక పెద్ద అడ్డంకిని, స్నేహితుల ద్రోహాన్ని సూచిస్తుందని చెబుతున్నారు.
10. కలలో కాకిని చూడటం దురదృష్టంగా చెబుతున్నారు. ఇది భవిష్యత్తులో ఒక పెద్ద వాదనను సూచిస్తుందని తెలిపారు.
READ ALSO: China: ప్రపంచ మార్కెట్‌లో చైనాపై చిన్న చూపు.. అమ్ముడుపోని డ్రాగన్ ఆయుధాలు
