Site icon NTV Telugu

Zelio Electric Scooter: సింగిల్ ఛార్జింగ్‌పై 90km ప్రయాణం.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర తక్కువ, ఫీచర్స్ ఎక్కువ!

Zelio Eeva Eco Lx

Zelio Eeva Eco Lx

భారతదేశానికి చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ‘జెలియో’ తాజాగా మూడు కొత్త ఇ-స్కూటర్లను విడుదల చేసింది. ఈవా ఎకో ఎల్ఎక్స్, ఈవా ఎకో జెడ్‌ఎక్స్, ఈవా ఎకో జెడ్‌ఎక్స్ ప్లస్‌లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ మూడు స్కూటర్లు ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక ఫీచర్లతో ప్రయాణానికి అనుకూలంగా ఉన్నాయి. సింగిల్ ఛార్జింగ్‌పై 90km ప్రయాణం చేయొచ్చు. రేండేళ్ల వారంటీతో వస్తున్న ఈ స్కూటర్ల ధర తక్కువగా ఉంది. అలా అని ఫీచర్లకు ఎలాంటి డోకా లేదు.

గ్రామంలో లేదా నగరంలో చిన్న చిన్న పనులకు జెలియో ఎలక్ట్రిక్ స్కూటర్లు బాగా ఉపయోగకరంగా ఉంటాయని కంపెనీ చెబుతోంది. కొత్త మోడల్‌లు, తక్కువ-స్పీడ్, తక్కువ ధరలో చూసే కోసం ఈ స్కూటర్లు ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. ఈవా ఎకో ఎల్ఎక్స్ ధర రూ.51,551 (ఎక్స్-షోరూమ్). 48/60V BLDC మోటారుతో వచ్చింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 60-90 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇందులో రెండు రకాల బ్యాటరీలను (జెల్, లిథియం) కలిగి ఉంటుంది. రెండు చక్రాలపై డ్రమ్ బ్రేక్‌లు, హైడ్రాలిక్ సస్పెన్షన్, పెద్ద 36-లీటర్ బూట్ స్పేస్‌ను కలిగి ఉంటుంది. ఇది నాలుగు రంగులలో (నలుపు, బూడిద, ఎరుపు, నీలం) అందుబాటలో ఉంది.

ఈవా ఎకో జెడ్‌ఎక్స్ ధర రూ.53,551 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో ఎల్ఎక్స్ మాదిరిగానే ఫీచర్స్ ఉంటాయి. ఈ స్కూటర్ కొంచెం స్పోర్టియర్ లుక్, పెద్ద టైర్లను కలిగి ఉంది. ఇది జెల్, లిథియం బ్యాటరీ ఎంపికలతో కూడా వస్తుంది. కొత్త గ్లోసీ వైట్ కలర్లో కూడా అందుబాటులో ఉంటుంది. జెడ్‌ఎక్స్ ప్లస్‌ మోడల్ కొత్త డిజైన్, మరింత శక్తివంతమైన పనితీరుతో వచ్చింది. దీని ప్రారంభ ధర రూ.65,051 (ఎక్స్-షోరూమ్). ఇది 60V, 72V మోటార్ ఎంపికలను కలిగి ఉంది. విభిన్న బ్యాటరీ కాన్ఫిగరేషన్‌లు (GEL మరియు లిథియం) కూడా అందుబాటులో ఉన్నాయి. భద్రత కోసం ముందు డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్‌ను కలిగి ఉంటుంది. దీని టైర్లు 90-90/12 పరిమాణాలు, మంచి రైడింగ్ అనుభవాన్ని అందిస్తాయి.

Also Read: Bellamkonda Suresh: నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కేసు నమోదు!

ఈ మూడు స్కూటర్లు డిజిటల్ డిస్‌ప్లే, కీలెస్ స్టార్ట్, క్రూయిజ్ కంట్రోల్, ఫైండ్-మీ ఫంక్షన్, ఇమ్మొబిలైజర్ సిస్టమ్, సెంటర్ లాక్, యాంటీ-థెఫ్ట్ అలారం, USB ఛార్జింగ్ పోర్ట్ మరియు పూర్తి LED లైటింగ్ వంటి అనేక స్మార్ట్ ఫీచర్లతో వస్తాయి. కంపెనీ అన్ని మోడళ్లపై రెండేళ్ల వారంటీని అందిస్తోంది. నగరంలో రోజువారీ ప్రయాణానికి ఇవి ఉపయోగకరంగా ఉండనున్నాయి. 2021లో హర్యానాలో మొదలైన కంపెనీ ఇప్పుడు ఏటా 72,000 స్కూటర్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ కంపెనీకి 20 కంటే ఎక్కువ రాష్ట్రాల్లో 280 కంటే ఎక్కువ డీలర్‌షిప్‌లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న జెలియో షోరూమ్‌లలో కొత్త మోడళ్ల బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

Exit mobile version