Site icon NTV Telugu

క్లాసిక్ స్టైల్‌కు మోడర్న్ టచ్.. Yezdi Roadster Red Wolf Edition భారత్‌లో లాంచ్..!

Yezdi Roadster Red Wolf Edition

Yezdi Roadster Red Wolf Edition

Yezdi Roadster Red Wolf Edition: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ “క్లాసిక్ లెజెండ్స్ (Classic Legends)” తన ఐకానిక్ రోడ్‌స్టర్ శ్రేణిలో కొత్త స్పెషల్ ఎడిషన్‌ ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. Yezdi Roadster Red Wolf Edition పేరుతో వచ్చిన ఈ మోడల్ 1970 కాలం నాటి యెజ్డీ బైక్‌ల వారసత్వాన్ని కొనసాగిస్తూ.. ఆధునిక సాంకేతికతతో మిళితమై తయారు చేశారు. క్లాసిక్ డిజైన్‌ను ఇష్టపడే యువత, రేట్రో బైక్ ప్రియులను లక్ష్యంగా చేసుకుని ఈ ఎడిషన్‌ను విడుదల చేశారు.

PV Sindhu: పివి సింధు సేఫ్.. క్షేమంగా భారత్ కు రాక..!

Red Wolf Edition ప్రధానంగా కాస్మెటిక్ అప్‌డేట్స్‌తో ప్రత్యేకతను కలిగి ఉంది. గ్లోసీ రెడ్ కలర్ స్కీమ్ బైక్‌కు రగ్గుడ్ లుక్‌ ను ఇస్తుంది. ఎగ్జాస్ట్, ఇంజిన్, హ్యాండిల్‌ బార్‌లపై క్రోమ్ ఫినిషింగ్ ఉండటంతో ప్రీమియం ఫీలింగ్ కలుగుతుంది. రిచ్ బ్రౌన్ కలర్ సీటు ఈ బైక్‌కు ప్రత్యేక ఆకర్షణ. మాడ్యులర్ సెటప్ వల్ల సోలో లేదా పిలియన్ సీటుగా మార్చుకునే సౌకర్యం ఉంది. మెకానికల్ పరంగా చూస్తే.. ఈ స్పెషల్ ఎడిషన్‌లో స్టాండర్డ్ రోడ్‌స్టర్ ఇంజిన్‌ ను కొనసాగించారు. ఇందులో334cc Alpha2 లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ 29 hp పవర్, 29.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంకా ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ తో పాటు అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ సదుపాయం ఉండటంతో గేర్ సులువుగా చేయవచ్చు.

IND Playing 11 vs ENG: ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్‌.. భారత జట్టులో కీలక మార్పు, ఆ స్టార్ ప్లేయర్ అవుట్!

ఇక బ్రేకింగ్ వ్యవస్థలో ముందు భాగంలో 320 mm డిస్క్, వెనుక భాగంలో 240 mm డిస్క్ బ్రేక్స్ అమర్చారు. డ్యూయల్ ఛానల్ ABS సిస్టమ్ వల్ల అత్యవసర పరిస్థితుల్లో కూడా బెస్ట్ నియంత్రణ లభిస్తుంది. 12.5 లీటర్ల ఇంధన ట్యాంక్‌ తో ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే 350 కి.మీ.కు పైగా ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక డ్యూయల్ షాక్ అబ్జార్బర్‌లు రైడింగ్‌ను సౌకర్యవంతంగా చేస్తాయి. బైకు ధర రూ. 2.10 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.

Exit mobile version