Site icon NTV Telugu

149cc సింగిల్‌-సిలిండర్‌, ఎయిర్‌ కూల్డ్ ఇంజిన్‌, స్టైలిష్ డిజైన్, అప్‌డేట్ ఫీచర్లతో Yamaha FZ Rave లాంచ్..!

Yamaha Fz Rave

Yamaha Fz Rave

Yamaha FZ Rave: ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ యమహా (Yamaha) భారత మార్కెట్లో కొత్త స్పోర్టీ బైక్ FZ Raveను విడుదల చేసింది. కొత్త Yamaha FZ Raveలో కంపెనీకి చెందిన 149cc సింగిల్‌ సిలిండర్‌, ఎయిర్‌ కూల్డ్ ఇంజిన్‌ అందించబడింది. ఇది గరిష్టంగా 12.4PS పవర్‌ను 7,250rpm వద్ద, అలాగే 13.3Nm టార్క్‌ను 5,500rpm వద్ద ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 5 స్పీడ్ గేర్‌బాక్స్‌ జత చేయబడింది. పనితీరు పరంగా ఇది నగర రైడింగ్‌కు, చిన్న ట్రిప్‌లకు సరైన కాంబినేషన్‌ను అందిస్తుంది. ఇక డిజైన్ పరంగా FZ Raveలో కొన్ని ముఖ్యమైన అప్‌డేట్స్‌ వచ్చాయి. ఇందులో రెడిజైన్ చేసిన LED హెడ్‌ల్యాంప్‌, స్లీక్ ట్యాంక్ ఎక్స్టెన్షన్స్‌, కాంట్రాస్టింగ్ గ్రాఫిక్స్‌ ఉన్నాయి. ఇవి FZ-S మోడల్‌ నుండి ఈ కొత్త వేరియంట్‌ను ప్రత్యేకంగా చూపిస్తాయి. యమహా ఈ బైక్‌ను మట్టే టైటాన్ (Matte Titan), మెటాలిక్ బ్లాక్ (Metallic Black) అనే రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్‌లలో అందిస్తోంది.

Nagarjuna – Konda Surekha : కొండా సురేఖకు భారీ ఊరట.. కేసు వాపస్ తీసుకున్న నాగర్జున

ఈ కొత్త FZ Rave 17-అంగుళాల అలాయ్ వీల్స్‌పై రన్ అవుతుంది. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్‌ అందించబడింది. రైడింగ్ సమయంలో కంఫర్ట్‌ను పెంచే విధంగా సీటు ఆకారం మార్చబడింది. అలాగే హ్యాండిల్‌బార్ పొజిషన్‌ను కొంచెం స్పోర్టీ స్టైల్‌లో డిజైన్ చేశారు. సేఫ్టీ పరంగా ఈ బైక్‌లో డిస్క్ బ్రేక్స్‌ రెండు వైపులా ఉండి, సింగిల్ చానల్ ABS సదుపాయం కూడా అందుబాటులో ఉంది. కొత్తగా రూపొందించిన ఫుల్ డిజిటల్ LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ ఈ బైక్‌లో అందించబడింది. ఇందులో ట్రిప్ వివరాలు, సగటు ఫ్యూయల్ వివరాలు, గేర్ పొజిషన్‌ వంటి సమాచారం చూడవచ్చు. డిస్‌ప్లేలో కొత్త యూజర్ ఇంటర్‌ఫేస్ కూడా ఉంది. ఈ కొత్త Yamaha FZ Rave బైక్ ఈ నెలాఖరులోగా దేశవ్యాప్తంగా ఉన్న యమహా బ్లూ స్క్వేర్ డీలర్‌ షిప్‌ లలో అందుబాటులోకి రానుంది. ఢిల్లీ ఎక్స్‌-షోరూమ్ ధర ప్రకారం దీని ధర రూ.1.49 లక్షలుగా ఉంది.

హోమ్ థియేటర్ అనుభవం ఇక ఇంట్లోనే.. ZEBRONICS Juke Bar 6500 పై రూ.11000 భారీ డిస్కౌంట్..!

Exit mobile version