NTV Telugu Site icon

Xiaomi SU7: Xiaomi SU7 ఎలక్ట్రిక్ కార్ వచ్చేసింది.. ఒక్క ఛార్జ్‌తో 800 కి.మీ రేంజ్..

Xiaomi Su7

Xiaomi Su7

Xiaomi SU7 Electric Car:ఎలక్ట్రిక్ కార్ మార్కెట్‌కి భారత్ గమ్యస్థానంగా మారుతోంది. ఇప్పటికే టాటా, మహీంద్రా వంటి దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాలు ఎలక్ట్రిక్ కార్లకు పెద్దపీట వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ కంపెనీలు కూడా భారత్ కార్ మార్కెట్‌పై కన్నేశాయి. ఇప్పటికే బీవైడీ, ఎంజీ వంటి బ్రాండ్లు ఎలక్ట్రిక్ కార్లను భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చాయి. ప్రస్తుతం ఇండియాలో టాటా నెక్సాన్.ఈవీ, ఎంజీ జెడ్‌ఎస్ ఈవీ, బీవైడీ ఆటో3, మహీంద్రా ఎక్స్‌యూవీ 400 వంటి కార్లు మంచి అమ్మకాలను నమోదు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో చైనీస్ టెక్నాలజీ Xiaomi తన తొలి ఎలక్ట్రిక్ వాహనం (EV), Xiaomi SU7 సెడాన్‌ కారుని భారత్‌లో ప్రదర్శించింది. భారతదేశంలో తన 10వ వార్షికోత్సవ సందర్భంగా ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. “హ్యూమన్ x కార్ x హోమ్” స్మార్ట్ ఎకోసిస్టమ్‌లో SU7 ఒక సమగ్ర అంశంగా పనిచేస్తోందని Xiaomi చెబుతోంది. ‘‘ఫుల్ సైజ్ హై పెర్ఫామెన్స్ ఎకో సిస్టమ్ సెడాన్’’గా కారుని అభివృద్ధి చేసింది. ఇది మొత్తం 5 ప్రధాన ఈవీ టెక్నాలజీలపై డెవలప్ చేశారు. E-Motor, CTB ఇంటిగ్రేటెడ్ బ్యాటరీ, Xiaomi డై-కాస్టింగ్, Xiaomi పైలట్ అటానమస్ డ్రైవింగ్, స్మార్ట్ క్యాబిన్ అనే అంశాలపై ఆధాపడి ఉంది. ఈ కారు డెవలప్ చేయడంలో 3,400 మంది ఇంజనీర్లు మరియు 1,000 మంది సాంకేతిక నిపుణులు ఉన్నారు.

Read Also: KTR: జగన్ ఓటమిపై కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. అది ఆశ్చర్యం కలిగించింది..!

Xiaomi SU7 మ్యాక్స్, గరిష్టంగా 673 HP పవర్‌ని, 838 Nm గరిష్ట టార్క్‌ని అందిస్తుంది. ఇది కేవలం 2.78 సెకన్లలో 100 kmph వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా 265 కి.మీ వేగాన్ని అందుకోగలదు. ఈ వేగంలో దీనిని ఫుల్ స్టాప్ చేయడానికి కేవలం 33.3 మీటర్లు మాత్రమే అవసరం. బ్యాటరీ సామర్థ్యాన్ని కంపెనీ వెల్లడించనప్పటికీ, ఒక్క ఫుల్ ఛార్జ్‌తో 800 కి.మీ రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

సేఫ్టీ ఫీచర్లకు ప్రాధాన్యత ఇస్తూ 16 యాక్టివ్ సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంటుంది. 56-అంగుళాల హెడ్-అప్ డిస్‌ప్లే, రొటేటింగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు 16.1-అంగుళాల 3K అల్ట్రా-క్లియర్ సెంట్రల్ కంట్రోల్ స్క్రీన్ మరియు తిరిగే డాష్‌బోర్డ్ ఉంది. దీంతో పాటు ADAS, ప్రీమియం సౌండ్ సిస్టమ్ కలిగి ప్రీమియం లుక్ అందిస్తుంది. అయితే, ఈ కారును ఎప్పుడు లాంచ్ చేస్తున్నారనే విషయంపై Xiaomi పెదవి విప్పలేదు.