NTV Telugu Site icon

Xiaomi Electric Car: షియోమీ నుంచి మొదటి ఎలక్ట్రిక్ కారు.. సూపర్ లుకింగ్! కొనకుండా అస్సలు ఉండలేరు

Ms11 Xiaomi

Ms11 Xiaomi

Xiaomi MS11 Electric Car Pics caught on road: పెట్రోల్, డీజీల్ ధరలు పెరగడంతో ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రతి కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల తయారీపై దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ ‘షియోమీ’ కార్ మార్కెట్‌లోకి ప్రవేశించబోతోంది. షియోమీ త్వరలో తన మొదటి ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకురానుంది. షియోమీ ఎంఎస్11 (Xiaomi MS11 Electric Car) పేరుతో ఎలక్ట్రిక్ కారును రిలీజ్ చేయనుంది. ఈ కారు టెస్టింగ్ మోడ్‌లో రన్ అవుతోంది. అయితే మార్కెట్లోకి రాకముందే ఈ ఎలక్ట్రిక్ కార్ డిజైన్ లీక్ అయింది.

ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఫొటో బాగా వైరల్ అవుతోంది. ఇందులో షియోమీ ఎంఎస్11 ఎలక్ట్రిక్ కారు కనిపిస్తుంది. రోడ్డుపై టెస్ట్ డ్రైవ్ చేస్తుండగా ఈ కారు కెమెరాలకు చిక్కింది. ఈ కారులో షియోమీ కంపెనీ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ అయిన లీ జున్ కూడా ఉన్నారు. ఆటోమోటివ్ బ్లాగర్ చాంగ్ యన్ ఇటీవల షియోమీ ఎంఎస్11 యొక్క కొన్ని టెస్ట్ ఫోటోలను షేర్ చేసారు. ఆ ఫొటోస్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సూపర్ లుకింగ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: 1 Ball 18 Runs: క్రికెట్ చరిత్రలో అత్యంత ఖరీదైన డెలివరీ.. ఒక్క బంతికి 18 పరుగులు! తప్పక చూడాల్సిన వీడియో

షియోమీ కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ కారు ఎంఎస్11ని 2024 ప్రారంభంలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ కారు కొంతకాలంగా అభివృద్ధిలో (టెస్టింగ్ మోడ్) ఉంది. ఇటీవలి కొన్ని నివేదికలు ఈ కారు యొక్క ముఖ్య ఫీచర్లను వెల్లడించాయి. ఎంఎస్11 కారు 19-అంగుళాల వీల్ రిమ్‌లతో ఫాస్ట్‌బ్యాక్-స్టైలిష్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఛార్జింగ్ పోర్ట్ వాహనం వెనుక ఎడమ వైపున ఉంటుంది. ఈ కారు రెండు వేర్వేరు కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంటుంది. మొదటి కాన్ఫిగరేషన్‌లో 400V వెర్షన్‌లో BYD లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్లేడ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. రెండవ కాన్ఫిగరేషన్‌లో 800V వెర్షన్‌లో CATL టెర్నరీ కిరిన్ బ్యాటరీ ఉంటుంది.

ఎంఎస్11 కారు డ్యూయల్ టోన్ స్కీమ్‌తో రానుంది. ఈ కారు రూప కల్పనలో ఏరోడైనమిక్స్ జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. దాంతో ఈ కారు మైలేజ్ మెరుగ్గా ఉండనుంది. కంపెనీ ఈ సెడాన్ ఎలక్ట్రిక్ కారును ముందుగా చైనాలో విడుదల చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత యూరప్‌తో సహా మరో కొన్ని దేశాల్లో రిలీజ్ చేయనున్నారు.

Also Read: iPhone 15 Launch: యాపిల్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఐఫోన్ 15 లాంచ్ డేట్ అప్పుడే! ధర, ఫీచర్ల వివరాలు ఇవే

Show comments