రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్నది. రెండు దేశాల మధ్య యుద్ధమే అయినప్పటికీ దాని ప్రభావం ప్రపంచ దేశాలపై తీవ్రస్థాయిలో పడింది. ఇప్పటికే కరోనా కారణంగా పెద్ద మొత్తంలో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచాన్ని మరింత అతలాకుతలం చేసింది. ఈ యుద్ధం కారణంగా ఆయిల్, నిత్యవసర ధరలతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు, స్మార్ట్ ఫోన్లు, ఈవీ వాహనాల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు నిత్యవసర వస్తువల ధరలు భారీగా పెరిగాయి. రాబోయే రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉన్నది.
Read: Air India: ఉక్రెయిన్ నుంచి తరలింపుకు భారత్ ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా?
కరోనా కారణంగా చిప్‌లకు కొరత ఏర్పడింది. ఈ యుద్ధంతో మరింత కొరత ఏర్పడే అవకాశం ఉంది. సెమీ కండక్టర్లలో వినియోగించే గ్రేడ్ నియాన్ ఉక్రెయిన్, అరుదైన లోహం పల్లాడియంను రష్యా ఉత్పత్తి చేస్తుంది. అత్యంత ఖరీదైన ఈ పల్లాడియం లోహం రష్యాలో మాత్రమే ఎక్కువగా ఉత్పత్తి అవుతంది. రష్యా నుంచి అమెరికాకు 35 శాతం మేర ఈ పల్లాడియం ఎగుమతి అవుతుంది. ఈ యుద్దం కారణంగా ఎగుమతి నిలిపివేశారు. ఇది పరోక్షంగా అమెరికాపై ప్రభావం చూపుతంది. దీంతో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ధరలు భారీగా పెరుగుతాయి. ఇప్పటికే కొరత కారణంగా చిప్‌ల తయారీ ఆగిపోయింది. యుద్ధం కారణంగా మరింత ఈ కొరత మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉందని జపాన్ ఆందోళన చేస్తున్నది.