Volvo C40 Recharge: ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ రోజురోజుకు పెరుగుతోంది. టూవీలర్లతో పాటు కార్ల అమ్మకాలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటికే ప్రముఖ కార్ మేకర్లు అన్నీ ఇండియా ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ పై కన్నేశాయి. దీంతో ప్రతీ కంపెనీ కూడా ఎలక్ట్రిక్ కార్ ను లాంచ్ చేస్తోంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో టాటా కార్స్ అగ్రస్థానంలో ఉన్నాయి. ఎంజీ, మహీంద్రా, సిట్రియోన్ వంటి కంపెనీలు కూడా కొత్తగా తమ ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్ కి పరిచయం చేశాయి.
Read Also: E-Schooter: వినియోగదారులకు షాక్.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.10 వేలు పెరిగిందోచ్..
ఇదిలా ఉంటే లగ్జరీ కార్లకు కేరాఫ్ అయిన వోల్వో తన రెండో ఎలక్ట్రిక్ కార్ మోడల్ ని ఆవిష్కరించింది. వోల్వో కార్ ఇండియా ఎలక్ట్రిక్ మోడల్ C40 రీఛార్జ్‌ను తీసుకువచ్చింది. కొత్త ఎలక్ట్రిక్ SUV ధరల వోల్వో ఆగస్టులో ప్రకటించనుంది. సెప్టెంబర్ నుంచి కస్టమర్లకు డెలివరీలు ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఇప్పటికే వోల్వో నుంచి XC40 రీఛార్జ్ పేరుతో ఎలక్ట్రిక్ SUV ఉంది.
కాంపాక్ట్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ (CMA) ప్లాట్‌ఫారమ్‌పై C40 రీఛార్జ్ ని తయారుచేవారు. ఈ కార్ 408 హెచ్ పీ తో 660 ఎన్ఎం టార్క్ ను జనరేట్ చేస్తుంది. ఈ కారులో ట్విన్ మోటార్ల సెటప్ కలిగి ఉంది. 78kWh బ్యాటరీని కలిగి ఉంది. ఒక్క ఛార్జ్ తో ఏకంగా 530 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వనుంది. ఇది కేవలం 4.5 సెకన్లలో 0-100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. ఈ కార్ ఆల్ వీల్ డ్రైవ్(AWD)తో వస్తోంది. ధరలను ప్రకటించిన తర్వాత కొనుగోలుదారులు నేరుగా కంపెనీ వెబ్‌సైట్ ద్వారా Volvo C40 రీఛార్జ్‌ను బుక్ చేసుకోవాలి.వోల్వో 2030 నాటికి పోర్ట్‌ఫోలియోలో 100% ఎలక్ట్రిఫైడ్ వాహనాలను కలిగి ఉండాలని మరియు 2040 నాటికి కార్బన్ న్యూట్రల్‌గా మారాలని యోచిస్తోంది.