Volkswagen Taigun Sound Edition: జర్మనీ ఆటోమేకర్ వోక్స్‌వ్యాగన్ తన కార్లతో ఇండియన్ మార్కెట్‌లో మంచి స్థానాన్ని సంపాదించింది. ముఖ్యంగా వోక్స్‌వ్యాగన్ తన ఎస్‌యూవీ టైగున్‌తో మార్కెట్‌లో అత్యధిక డిమాండ్ ఉన్న కాంపాక్ట్ XUVలో విభాగంలో గట్టి పోటీనిస్తోంది. ఇందుకు తగ్గట్లుగానే ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ సంపాదిస్తోంది.
ప్రస్తుతం ఇండియాలో గ్లోబల్ NCAPలో పిల్లలకు, పెద్దలకు ఫైవ్ స్టార్ సేఫ్టీ అందిస్తున్న కార్లతో వోక్స్‌వ్యాగన్ టైగున్, వర్టస్ ఉన్నాయి. తాజాగా ఈ రెండు కూడా కొత్త ఎడిషన్‌లో లాంచ్ అయ్యాయి. వోక్స్ వ్యాగన్ ఇండియా మంగళవారం టైగున్, వర్టస్ సౌండ్ ఎడిషన్‌ని లాంచ్ చేసింది. ప్రత్యేకంగా ట్యూన్ చేయబడిన ఆడియో సిస్టమ్స్‌తో ఈ రెండు కార్లు వచ్చాయి. సౌండ్ ఎడిషన్ ప్రస్తుతం టైగున్, వర్టస్ 1.0 లీటర్ TSI (115PS/178Nm) టాప్‌లైన్ వేరియంట్‌లలో ప్రత్యేకంగా అందించబడుతోంది.
Read Also: MLC Kavitha: ఎమ్మెల్యే షకీల్పై కాంగ్రెస్ దాడిని ఖండించిన ఎమ్మెల్సీ కవిత
ముఖ్యంగా మ్యూజిక్ లవర్స్‌ని ఈ ఎడిషన్ ఎంతో ఆకట్టుకుంటుంది. మెరుగైన ఆడియో అనుభవం కోసం సబ్-వూఫర్, యాంప్లిఫైయర్ ఇవ్వబడుతున్నాయి. సౌండ్ ఎడిషన్ సెగ్మెంట్‌లో ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫ్రంట్ సీట్లు, ల్యాంప్స్, ఫుట్ వెల్ ఇల్యూమినేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఏ పిల్లర్ ట్విట్రర్లపై ‘సౌండ్’ బ్రాండింగ్ ఉంటుంది. రెండు కార్లు కూడా నాలుగు రంగుల్లో( లావా బ్లూ, కార్బన్ స్టీల్ గ్రే, వైల్డ్ చెర్రీ రెడ్డ, రైజింగ్ బ్లూ) అందుబాటులో ఉన్నాయి. టైగున్ వైట్ రూఫ్, వైట్ ORVM క్యాప్స్‌తో కూడిన డ్యూయల్-టోన్ కలర్‌లో అందుబాటులో ఉంది.
ధరల వివరాలు..
ట్రాన్స్మిషన్ టైగున్ సౌండ్ ఎడిషన్(1.0 టీఎస్ఐ) వర్టస్ సౌండ్ ఎడిషన్ (1.0 టీఎస్ఐ)
మాన్యువల్ రూ. 16,32,900 రూ. 15,51,900
ఆటోమెటిక్ రూ. 17,89,900 రూ. 16,77,400