స్టైలిష్ లుక్స్, శక్తివంతమైన ఇంజిన్‌తో Volkswagen Taigun.. ఈ SUV మార్కెట్లోకి వచ్చేది ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Volkswagen Taigun: భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రముఖ స్థానం సంపాదించిన Volkswagen Taigun.. ఇప్పుడు మరింత అత్యాధునిక మార్పులతో.. కొత్త అవతారంలో రాబోతోంది. వోక్స్వ్యాగన్ కంపెనీ ఈ SUV కొత్త వెర్షన్‌ను ఏప్రిల్ 9న అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే పూణే ప్లాంట్‌లో దీని ఉత్పత్తి ప్రారంభమైందని సంస్థ వెల్లడించింది. 2021లో మొదటిసారిగా విడుదలైన టైగన్ భారతదేశంలో మంచి ఆదరణ పొందింది. ఇప్పటివరకు 1.43 లక్షల యూనిట్లకు పైగా ఉత్పత్తి చేయబడగా, అందులో సుమారు 30 శాతం వాహనాలు విదేశాలకు ఎగుమతి చేయబడ్డాయి. ఇది భారతదేశాన్ని గ్లోబల్ తయారీ కేంద్రంగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిందని కంపెనీ పేర్కొంది.
టైగన్ డిజైన్‌లో సరికొత్త మార్పులు..
కొత్త టైగన్ డిజైన్‌లో గణనీయమైన మార్పులు తీసుకువచ్చారు. ముందుభాగంలో లైట్ బార్‌తో అనుసంధానించబడిన స్లీక్ LED హెడ్‌ల్యాంప్‌లు, ప్రకాశవంతమైన వోక్స్వ్యాగన్ లోగో, కొత్త గ్రిల్ మరియు స్పోర్టీ బంపర్ ఈ SUVకి ఆకర్షణీయమైన లుక్‌ను ఇస్తాయి. వెనుక భాగంలో కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్‌లు, పెద్ద స్కిడ్ ప్లేట్ మరియు కొత్త అల్లాయ్ వీల్స్ దీని స్టైలింగ్‌ను మరింత బలోపేతం చేస్తాయి.
Also Read
- Hero Impulse: రీ-ఎంట్రీకి సిద్ధమైన ఐకానిక్ బైక్.. ఎక్స్‌పల్స్ కంటే తక్కువ ధరలోనే కొత్త ఆఫ్-రోడర్!
- Kia Sorento: టయోటా ఫార్చ్యూనర్‌కు సవాల్.. రూ. 28 లక్షలకే బిగ్ ఎస్యూవీ.. ఏపీలోనే తయారీ!
- Volkswagen Tukan Pickup: వోక్స్వ్యాగన్ టుకాన్ పికప్ ఆవిష్కరణ.. రగ్డ్ డిజైన్, 1.5 TSI హైబ్రిడ్ ఇంజిన్
- 7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
స్టైలిష్ ఇంటీరియల్..
ఇంటీరియర్ విషయానికి వస్తే, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉండే అవకాశం ఉంది. కొత్త అప్హోల్స్టరీ, మెరుగైన ఫినిషింగ్‌లు వాహనానికి ప్రీమియం అనుభూతిని అందిస్తాయి. అలాగే పవర్డ్ మరియు వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, మెరుగైన ఎయిర్ కండిషనింగ్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉండొచ్చని సమాచారం.
అత్యాధునిక ఇంజిన్
ఇంజిన్ పరంగా కూడా ఈ SUV శక్తివంతంగా ఉంటుంది. 1.0 లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజన్ సుమారు 115bhp పవర్, 178Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే 1.5 లీటర్ TSI ఇంజన్ 150bhp పవర్, 250Nm టార్క్ ఇస్తుంది. ట్రాన్స్మిషన్ విషయంలో 1.0 లీటర్ వేరియంట్‌కు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, 1.5 లీటర్ వేరియంట్‌కు 7-స్పీడ్ DSG గేర్‌బాక్స్ అందించే అవకాశముంది. మొత్తంగా చూస్తే, కొత్త ఫీచర్లు, స్టైలిష్ డిజైన్, శక్తివంతమైన ఇంజన్‌తో కొత్త Volkswagen Taigun SUV విభాగంలో మరింత పోటీని పెంచేలా కనిపిస్తోంది. కొత్త కారు కొనాలనుకునే వారికి ఇది మంచి ఎంపికగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు..
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!