Volkswagen: వోక్స్‌వ్యాగన్ కార్లకు యూత్‌లో ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పోలో వంచి కార్లు యూత్‌ను బాగా ఎట్రాక్ట్ చేశాయి. ఈ ఏడాదిలో ఈ కంపెనీ పెద్ద ప్లాన్ వేసింది. ఇకపై ఈ జర్మన్ కార్ల కంపెనీ ఇండియన్ మార్కెట్‌ను లైట్‌గా తీసుకునే పరిస్థితి లేదని తాజా ప్రకటన చూస్తే అర్థమవుతోంది. వచ్చే ఏడాది మొత్తం ఐదు కొత్త కార్లను విడుదల చేయాలని కంపెనీ నిర్ణయించింది. మూడు నెలలకు ఒక కొత్త మోడల్ చొప్పున మార్కెట్లోకి తీసుకురావాలని టార్గెట్ పెట్టుకుంది. ఈ కొత్త కార్లతో వోక్స్‌వ్యాగన్ అన్ని విభాగాలను కవర్ చేయాలని చూస్తోంది. SUVలు మాత్రమే కాదు.. సెడాన్లు, హ్యాచ్‌బ్యాక్‌లు సైతం ఈ లైనప్‌లో ఉంటాయి. కుటుంబ అవసరాల నుంచి యువత ఇష్టపడే స్టైలిష్ కార్ల వరకు అన్నీ ఒకే ఏడాదిలో రాబోతున్నాయి. కంపెనీ మొట్ట మొదటగా Volkswagen Tayron R-Line ఎస్‌యూవీని విడదల చేయనుంది. ఇది మామూలు ఎస్‌యూవీ కాదు.. మూడు వరుసల సీట్లతో వచ్చే పెద్దగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న Tiguan R-Line కంటే ఇది పెద్దదని కంపెనీ చెబుతోంది. దీన్ని కంపెనీ ఉపయోగించే MQB EVO ప్లాట్‌ఫామ్‌పై దీన్ని నిర్మించారు. ఇండియన్ మార్కెట్లో ఇది నేరుగా Jeep Meridian, Toyota Fortuner లాంటి బలమైన కార్లకు పోటీగా నిలవనుంది. త్వరలో రానున్న Skoda Kodiaq RSకూ ఇది గట్టి ప్రత్యర్థిగా మారనుంది.
READ MORE: PM Modi: ప్రపంచానికి భారత్ ఆశాకిరణం.. ఈయూ డీల్‌ను మరోసారి ప్రశంసించిన మోడీ
ఈ Tayron R-Line లో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ నుంచి 204 హార్స్‌పవర్ శక్తి, 320 Nm టార్క్ వస్తుంది. ఈ పవర్‌ను ఏడు స్పీడ్ DSG గేర్‌బాక్స్ ద్వారా నాలుగు చక్రాలకూ అందుతుంది. అంటే ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో ఆప్, హైవేలపై మంచి పర్ఫామెన్స్ ఇవ్వనుంది. ఈ కారును భారత్‌కు CKD మార్గంలో తీసుకురానున్నారు. అంటే విదేశాల్లో తయారైన భాగాలను ఇక్కడ అసెంబుల్ చేస్తారు. ఇక మిగతా మోడళ్ల గురించి వోక్స్‌వ్యాగన్ అధికారికంగా వివరాలు ఇవ్వలేదు. కానీ.. మార్కెట్‌లో ఇప్పటికే కొన్ని అంచనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అమ్మకాల్లో ఉన్న Taigun, Virtus కార్లకు కొత్త రూపం రానుందని భావిస్తున్నారు. ఈ రెండు కార్లు కొంతకాలంగా అలాగే ఉన్నాయి. అందుకే ఫేస్‌లిఫ్ట్ అవసరం ఉంది. ఇప్పటికే ఇవి టెస్టింగ్ సమయంలో పలుమార్లు బయట కనిపించాయి. కొత్త లుక్, కొన్ని కొత్త ఫీచర్లతో ఇవి తిరిగి మార్కెట్లోకి రానున్నాయి. ఇదే కాకుండా, వోక్స్‌వ్యాగన్ తమ ఎలక్ట్రిక్ ప్రయాణాన్ని కూడా బలపరచాలని చూస్తోంది. అందులో భాగంగా ID.Polo అనే ఎలక్ట్రిక్ కారును తీసుకురావచ్చని భావిస్తున్నారు. ఇది ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో బ్రాండ్‌కు మంచి గుర్తింపు తీసుకువచ్చే మోడల్‌గా భావిస్తున్నారు.
