VinFast Minio Green EV: సామాన్యుల ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది..! ఇది నానో కంటే చిన్నది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VinFast Minio Green EV: వియత్నామీస్(వియత్నం) కార్ల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ జూలై 15న తన మొదటి షోరూమ్‌ను ప్రారంభిస్తూ.. భారత్‌లోకి అధికారికంగా ప్రవేశించినట్లు ప్రకటించింది. కంపెనీ తన రెండు ఎలక్ట్రిక్ కార్లు VF6, VF7 లను స్థానిక మార్కెట్లో ప్రదర్శించింది. వీటి బుకింగ్ ఇప్పటికే ప్రారంభయ్యాయి. తాజాగా కంపెనీ భారత్‌లో మరో ఎలక్ట్రిక్ కారు ‘మినియో గ్రీన్’ డిజైన్‌కు పేటెంట్ పొందింది. దీనిని త్వరలో ఇక్కడ మార్కెట్లో లాంచ్ చేయవచ్చని చెబుతున్నారు. ఇది టాటా నానో కంటే చిన్న సైజులో ఉండే మినీ ఎలక్ట్రిక్ కారు. మినియో గ్రీన్ కారు పొడవు 3090 మి.మీ, వెడల్పు 1496 మి.మీ, ఎత్తు 1659 మి.మీ. నానో సైజు గురించి మాట్లాడుకుంటే.. పొడవు 3164 మి.మీ, వెడల్పు 1750 మి.మీగా ఉండేది.
READ MORE: Tahawwur Rana: ఉగ్రవాదికి 3 ఫోన్ కాల్స్‌కు పర్మిషన్.. షరతులు వర్తిస్తాయ్..!
Also Read
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
- Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
- 350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
ఈ విన్‌ఫాస్ట్ కంపెనీకి చెందిన ఈ కారు ఇప్పటికే వియత్నాంలో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ కారు 14.7 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 170 కి.మీ.ల రేంజ్‌ను అందిస్తుంది. ఇది గరిష్టంగా 27 bhp పవర్, 65 Nm పీక్ టార్క్‌ని అందిస్తుంది. అంటే విన్‌ఫాస్ట్ మినియో గ్రీన్ టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇది ఓ ఈ మూడు-డోర్ల ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారు. ఇందులో సెమీ-సర్క్యులర్ LED హెడ్లైట్లు, టెయిల్లైట్లు, ఫ్లాప్-టైప్ డోర్ హ్యాండిల్స్, బ్లాక్ ORVMలు, ఒక చిన్న రూఫ్ స్పాయిలర్‌తో వస్తుంది. ఈ కారులో కంపెనీ 13-అంగుళాల స్టీల్ వీల్స్ ను పొందుపర్చింది. దాదాపు స్కూటర్ వీల్స్ మాదిరిగా కనిపిస్తుంది. ఈ ఫ్రంట్ వీల్ డ్రైవ్ కారులో ఎయిర్ కండిషనింగ్, 2 స్పీకర్లు, డ్రైవింగ్ సీటు, ఎఫ్ రేడియోను అమర్చారు. డాష్‌బోర్డ్ మధ్యలో రెండు AC వెంట్లు మాత్రమే ఇచ్చారు. ఈ విన్ ఫాస్ట్ మినియో గ్రీన్‌లో మాన్యువల్ ఎయిర్ కండిషనింగ్ మాత్రమే ఉంది. ఈ కారు లోపలి భాగం చాలా మినిమలిస్టిక్ డిజైన్‌తో అలంకరించారు. ఇందులో రెండు-స్పోక్ స్టీరింగ్ వీల్, సీట్ల కోసం ఫాబ్రిక్ అప్హోల్స్టరీ, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే ఉన్నాయి. విన్‌ఫాస్ట్ మినియో గ్రీన్ ఈవీలో డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, EBD తో ABS వంటి భద్రతా లక్షణాలు ఉన్నాయి. లాంఛ్‌కి ముందే దీని ధర గురించి చెప్పడం కష్టం.
తాజావార్తలు
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
-
IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు