Site icon NTV Telugu

VinFast Minio Green EV: సామాన్యుల ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది..! ఇది నానో కంటే చిన్నది..

Ev

Ev

VinFast Minio Green EV: వియత్నామీస్(వియత్నం) కార్ల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ జూలై 15న తన మొదటి షోరూమ్‌ను ప్రారంభిస్తూ.. భారత్‌లోకి అధికారికంగా ప్రవేశించినట్లు ప్రకటించింది. కంపెనీ తన రెండు ఎలక్ట్రిక్ కార్లు VF6, VF7 లను స్థానిక మార్కెట్లో ప్రదర్శించింది. వీటి బుకింగ్ ఇప్పటికే ప్రారంభయ్యాయి. తాజాగా కంపెనీ భారత్‌లో మరో ఎలక్ట్రిక్ కారు ‘మినియో గ్రీన్’ డిజైన్‌కు పేటెంట్ పొందింది. దీనిని త్వరలో ఇక్కడ మార్కెట్‌లో లాంచ్ చేయవచ్చని చెబుతున్నారు. ఇది టాటా నానో కంటే చిన్న సైజులో ఉండే మినీ ఎలక్ట్రిక్ కారు. మినియో గ్రీన్ కారు పొడవు 3090 మి.మీ, వెడల్పు 1496 మి.మీ, ఎత్తు 1659 మి.మీ. నానో సైజు గురించి మాట్లాడుకుంటే.. పొడవు 3164 మి.మీ, వెడల్పు 1750 మి.మీగా ఉండేది.

READ MORE: Tahawwur Rana: ఉగ్రవాదికి 3 ఫోన్ కాల్స్‌కు పర్మిషన్.. షరతులు వర్తిస్తాయ్..!

ఈ విన్‌ఫాస్ట్ కంపెనీకి చెందిన ఈ కారు ఇప్పటికే వియత్నాంలో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ కారు 14.7 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 170 కి.మీ.ల రేంజ్‌ను అందిస్తుంది. ఇది గరిష్టంగా 27 bhp పవర్, 65 Nm పీక్ టార్క్‌ని అందిస్తుంది. అంటే విన్​ఫాస్ట్ మినియో గ్రీన్ టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇది ఓ ఈ మూడు-డోర్ల ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారు. ఇందులో సెమీ-సర్క్యులర్ LED హెడ్‌లైట్లు, టెయిల్‌లైట్లు, ఫ్లాప్-టైప్ డోర్ హ్యాండిల్స్, బ్లాక్ ORVMలు, ఒక చిన్న రూఫ్ స్పాయిలర్‌తో వస్తుంది. ఈ కారులో కంపెనీ 13-అంగుళాల స్టీల్ వీల్స్ ను పొందుపర్చింది. దాదాపు స్కూటర్ వీల్స్ మాదిరిగా కనిపిస్తుంది. ఈ ఫ్రంట్ వీల్ డ్రైవ్ కారులో ఎయిర్ కండిషనింగ్, 2 స్పీకర్లు, డ్రైవింగ్ సీటు, ఎఫ్‌ రేడియోను అమర్చారు. డాష్‌బోర్డ్ మధ్యలో రెండు AC వెంట్లు మాత్రమే ఇచ్చారు. ఈ విన్ ఫాస్ట్ మినియో గ్రీన్‌లో మాన్యువల్ ఎయిర్ కండిషనింగ్ మాత్రమే ఉంది. ఈ కారు లోపలి భాగం చాలా మినిమలిస్టిక్ డిజైన్‌తో అలంకరించారు. ఇందులో రెండు-స్పోక్ స్టీరింగ్ వీల్, సీట్ల కోసం ఫాబ్రిక్ అప్హోల్స్టరీ, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే ఉన్నాయి. విన్‌ఫాస్ట్ మినియో గ్రీన్ ఈవీలో డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, EBD తో ABS వంటి భద్రతా లక్షణాలు ఉన్నాయి. లాంఛ్‌కి ముందే దీని ధర గురించి చెప్పడం కష్టం.

Exit mobile version