Vinfast India: భారత్‌లోకి వియత్నాం ఆటోమొబైల్ కంపెనీ ఎంట్రీ.. ఇవి సూపర్ కార్స్ గురూ..!
- వియత్నాంకు చెందిన ఆటోమొబైల్ కంపెనీ విన్‌ఫాస్ట్
- భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధం
- భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో హాజరు
- సంస్థ తన ఎంట్రీకి సంబంధించిన టీజర్ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వియత్నాంకు చెందిన ఆటోమొబైల్ కంపెనీ విన్‌ఫాస్ట్ భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమైంది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 నుంచి కంపెనీ భారతదేశంలోకి ప్రవేశించబోతోంది. సంస్థ తన ఎంట్రీకి సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో భారతి ఎంట్రీ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. సోషల్ మీడియాలో కంపెనీ షేర్ చేసిన టీజర్‌లో 5-సీటర్ VF7, 7-సీటర్ VF9 కార్లను పరిచయం చేసింది.
ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ రెడీ…
విన్‌ఫాస్ట్ భారతీయ మార్కెట్లో పూర్తి ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురాబోతోంది. కంపెనీ కేవలం ఎస్‌యూవీలకు మాత్రమే పరిమితం కావడం లేదు. బ్యాటరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మాత్రమే కాకుండా, ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్‌ను కూడా పేటెంట్ చేసింది. దాని గ్లోబల్ మోడల్స్‌లో ఒకటైన VF e34 ఇటీవలే భారతీయ రోడ్లపై పరీక్షిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే.. ఈ మోడల్‌ను టీజర్‌లో చూపించలేదు.
Also Read
- Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
- Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
- BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
వచ్చే 3 సంవత్సరాల్లో ఈవీ ఉత్పత్తులు..
విన్‌ఫాస్ట్ గతంలో భారత్, ఇండోనేషియాలో ఉత్పత్తి ప్లాంట్‌లను ఏర్పాటు చేసే ప్రణాళికలను వెల్లడించింది. వచ్చే 3 సంవత్సరాల్లో ఈ రెండు దేశాల్లో ఈవీ ఉత్పత్తి ప్రారంభించాలని తెలిపింది. విన్‌ఫాస్ట్ మొదటి ఐదేళ్లలో $500 మిలియన్లు ఖర్చు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. తమిళనాడు ప్రభుత్వంతో ఉమ్మడి ఒప్పందం కూడా చేసుకుంది. కంపెనీ ఈ సంవత్సరంలోనే బ్యాటరీ ప్లాంట్, తయారీ సౌకర్యాల ఉత్పత్తిని ప్రారంభించ వచ్చని అంచనా.. తమిళనాడులోని తూత్తుకుడిలో వీటిని ఏర్పాటు చేయనుంది. దీనివల్ల రాష్ట్రానికి 3,500 ఉద్యోగాలు కూడా వస్తాయి.
VF7 ఫీచర్లు ఇవే..
VF7 అనేది 75.3 kWh బ్యాటరీ ప్యాక్‌తో కూడిన ఆల్-ఎలక్ట్రిక్ 5-సీటర్ ఎస్‌యూవీ. కంపెనీ ప్రకారం.. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 450కిమీల రేంజ్‌ను అందిస్తుంది. VF7 సింగిల్ లేదా డ్యూయల్-ఎలక్ట్రిక్ మోటార్ సెటప్‌తో వస్తుంది. ఫ్రంట్-వీల్ డ్రైవ్‌తో 201 bhp, 310 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డ్యూయల్ మోటార్ సెటప్ ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్‌లతో వస్తుంది. ఇది 348 బీహెచ్‌పీ, 500 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండు వేరియంట్లలో బ్యాటరీ ప్యాక్ ఒకే విధంగా ఉంటుంది. సింగిల్ మోటారు సింగిల్ ఛార్జ్‌పై 450కిమీల రేంజ్‌ను అందిస్తుంది. డ్యూయల్ మోటారు 431కిమీల రేంజ్‌ను అందిస్తుంది. ఈ కారులో 15-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే ఉంది. ఇది లెవెల్-2 ADAS సూట్‌తో వస్తుంది.
VF9 ఫీచర్లు..
VF9 కారు ఓ 7- సీటర్. ఇందులో 123 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది బేస్ ఈసీఓ వేరియంట్ కోసం 531Km, ప్లస్ వేరియంట్ కోసం 468Km సింగిల్-ఛార్జ్ పరిధిని క్లెయిమ్ చేస్తుంది. ఇది 6-సీటర్ కాన్ఫిగరేషన్‌లో కూడా ఉంటుంది. ఎస్‌యూవీ రెండు వేరియంట్‌లలో AWD స్టాండర్డ్‌గా డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్ సెటప్‌ను కలిగి ఉంది. ఇది 402 బీహెచ్‌పీ, 620 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 200కిమీ/గం వేగంగా వెళ్లగలదు. విన్‌ఫాస్ట్ 6.6 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగాన్ని అందుకోగలదని కంపెనీ పేర్కొంది. డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో రెండు వేరియంట్‌లను 35 నిమిషాల్లో 10 నుంచి 70% వరకు ఛార్జ్ చేయవచ్చు. ఈ కారులో 15.6-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే ఉంది. ఇది వివిధ భద్రతా లక్షణాలతో 2- ADASతో వస్తోంది.
తాజావార్తలు
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!