Electric Cars: భారత ఆటో మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల(EV) జోరు పెరుగుతోంది. ఈవీ మార్కెట్‌లో పెరుగుదల కనిపించడంతో అన్ని కంపెనీలు కూడా తమ ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. 2026లో పలు కంపెనీలు తమ ఈవీ కార్లను విడుదల చేయబోతున్నాయి. టాటా మోటార్స్, మారుతి సుజుకి, టయోటా వంటి ప్రముఖ బ్రాండ్లు తమ కార్‌లను భారత మార్కెట్‌లోకి తీసుకువస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది 5 ఎలక్ట్రిక్ కార్లు విడుదల కాబోతున్నాయి.
మారుతి సుజుకి e Vitara(Maruti Suzuki e Vitara):
మారుతి సుజుకి ఎలక్ట్రిక్ వాహనం రంగంలోకి ప్రవేశిస్తోంది. హ్యాందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, మహీంద్రా BE6, MG ZS EV, టాటా కర్వ్ EVలకు గట్టి పోటీ ఇచ్చేందుకు “మారుతి సుజుకి ఇ-విటారా”ను రిలీజ్ చేయబోతోంది. ఇ విటారా 49 kWh, 61 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో ఐదు-స్టార్ భద్రతా రేటింగ్‌తో వస్తోంది. గరిష్టంగా ఒకే ఛార్జ్‌పై 543 కి.మీ.ల రేంజ్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది.
టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా( Toyota Urban Cruiser Ebella ):
టయెటా కూడా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా పేరుతో ఈవీ కార్‌తో మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. మారుతి సుజుకి ఈ విటారా లాగే ఇది కూడా ఉంటుంది. 49 kWh, 61 kWh బ్యాటరీ ప్యాక్‌లను కలిగి ఉంటుంది. ఈ కార్ కూడా సింగిల్ ఛార్జ్‌తో 543 కి.మీ రేంజ్ ఇస్తుంది. భారత మార్కెట్లో ‘బ్యాటరీ యూజ్ ఏ సర్వీస్’ ఆప్షన్ ఇస్తుంది.
విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్ (VinFast Limo Green):
వియత్నాం కార్ బ్రాండ్ విన్ ఫాస్ట్ కూడా తన లిమో గ్రీన్ ఎలక్ట్రిక్ MPVని ఈ ఏడాది విడుదల చేస్తుంది. BYD eMax 7 వంటి మోడళ్లతో ఈ కార్ పోటీ పడనుంది. ఈ కారు 60.1 kWh బ్యాటరీని కలిగి ఉంటుంది. 201 హర్స్ పవర్ శక్తిని ఇస్తుంది. ఫ్రంట్ యాక్సిల్ మౌంటెడ్ మోటార్ ఉంటుంది. ఇది 450 కి.మీ రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
విన్‌ఫాస్ట్ VF3(VinFast VF3):
విన్‌ఫాస్ట్ VF3 కూడా ఇదే ఏడాది మార్కెట్‌లోకి వస్తోంది. ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారు భారతదేశంలోని మధ్య తరగతి వర్గాన్ని టార్గెట్ చేయనుంది. 18.6kWh బ్యాటరీ ప్యాక్ కలిగిన ఈకారు ధర రూ. 8 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్య ఉంటుందని అంచనా.
టాటా పంచ్ EV ఫేస్‌లిఫ్ట్ (Tata Punch EV Facelift):
దేశీయ కార్ మేకర్ దిగ్గజం టాటా కూడా ఈవీ మార్కెట్‌లో తన ఆధిపత్యం కొనసాగిందేకు టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌ను తీసుకువస్తోంది. ఫ్రంట్ గ్రిల్, హెడ్ లైట్స్, బంపర్, అల్లాయ్ వీల్స్, ఎల్‌ఈడీ కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్ వంటి అనేక అప్‌డేట్స్‌తో ఈ కారు రాబోతోంది. ఇది 25 kWh, 35 kWh బ్యాటరీ ప్యాక్‌లకు కలిగి ఉంటుంది.
