JSW MG మోటార్ ఇండియా తమ ICE SUV మోడల్స్‌పై తగ్గించిన జీ.ఎస్.టి. రేట్ల పూర్తి ప్రయోజనాన్ని వినియోగదారులకు అందిస్తోంది. ఈ తగ్గింపులు స్పేర్ పార్ట్‌లు, యాక్ససరీస్‌లకు కూడా వర్తిస్తాయని కంపెనీ పేర్కొంది. సవరించిన ధరలు నేటి నుండి అమల్లోకి వచ్చాయి. వీటితో వినియోగదారులకు రూ. 54,000 నుండి రూ. 3,04,000 వరకు ఆదా అవుతుంది.
Shocking : ఓవర్సీస్ ‘OG’ డిస్ట్రిబ్యూటర్ సంఘ విద్రోహి.. మా థియేటర్స్ లో ‘OG’ రిలీజ్ చేయడం లేదు
JSW MG మోటార్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ మాట్లాడుతూ.. GST రేట్లను హేతుబద్ధీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయం స్వాగతించదగిన చర్య అని అన్నారు. ఇది కొనుగోలుదారుల ఆర్థిక శక్తిని పెంచి, సానుకూల వినియోగదారుల సెంటిమెంట్‌ను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. ఈ సంస్కరణల పూర్తి ప్రయోజనాన్ని మా వినియోగదారులకు బదిలీ చేయడం ద్వారా, మా SUV పోర్ట్‌ఫోలియోలోని ఆస్టర్, హెక్టర్, గ్లోస్టర్ మోడల్స్‌ను మరింత అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు.
Railways: నార్త్ సెంట్రల్ రైల్వే వివాస్పద ఉత్తర్వులు.. కొన్ని గంటలకే తగ్గిన సర్కార్
పండుగ సీజన్‌కు ముందు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, ఈ చర్య మా వినియోగదారులకు విలువను అందించడం, సులభంగా వాహనాలను సొంతం చేసుకోవడాన్ని ప్రోత్సహించడం.. ఎక్కువ మంది వినియోగదారులు MG బ్రాండ్‌ను వినియోగించేలా చేయడం వంటి మా నిబద్ధతను బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు.
