NTV Telugu Site icon

Ultraviolette: ఓలా పని అవుట్! మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. కార్లతో సమానంగా ఫీచర్స్!

Unveils Tesseract Electric Scooter

Unveils Tesseract Electric Scooter

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ వేగంగా పెరుగుతోంది. కొత్తగా ద్విచక్ర వాహనాలను కొనే వాళ్లు ఎలక్ట్రిక్ వాహనాలకు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల అల్ట్రావైలెట్ హై-ఎండ్ సూపర్ బైక్ విభాగంలో తన మొదటి ఉత్పత్తి షాక్ వేవ్ ని విడుదల చేసింది. దీని ధర రూ. 1.45 లక్షలు (ఎక్స్-షోరూమ్), కానీ మొదటి 10,000 మంది కస్టమర్లకు కేవలం రూ. 1.20 లక్షలకే లభిస్తుంది. ఈ స్కూటర్‌ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. దీని ఫీచర్లు తెలుకున్న నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు. ఈ స్కూటర్ ఓలాకు చెక్ పెడుతుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కార్లలో ఇప్పటి వరకు లేని ఫీచర్లు కూడా ఈ స్కూటర్‌లో ఉన్నాయి. వాటి గురించి చర్చ జరుగుతోంది.

అల్ట్రావయోలెట్ టెస్రాక్ట్ ప్రత్యేకత ఏమిటి?
అల్ట్రావయోలెట్ టెస్రాక్ట్ ఫుల్ ఛార్జ్ చేస్తే 261 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ ఇ-స్కూటర్ కేవలం 2.9 సెకన్లలోనే గంటకు 0-60 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీనికి 3.5kWh, 5kWh, 6kWh అనే మూడు బ్యాటరీ ఎంపికలు ఉన్నాయి. స్కూటర్ గరిష్టంగా 20.10 బిహెచ్ పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్‌లో స్పేష్ కూడా ఎక్కువగానే ఉంది. 34 లీటర్ల సామర్థ్యం కలిగిన అండర్ సీట్ స్టోరేజ్ ఉంది.

గొప్ప డిజైన్, శక్తివంతమైన సాంకేతికత..
అల్ట్రావయోలెట్ టెస్రాక్ట్ భారతదేశంలోని అత్యంత హైటెక్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటిగా నిలిచింది. ఇది డ్యూయల్-రాడార్ సిస్టమ్ తో వస్తుంది. దీని ముందు, వెనుక భాగాల్లో కెమెరాలు అమర్చారు. ఇది బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ఓవర్‌టేక్ అలర్ట్, కొలిజన్ అలర్ట్ వంటి ప్రత్యేక ఫీచర్స్ కలిగి ఉంది. డిజైన్ కూడా ఆకట్టుకుంటోంది. అల్ట్రావైలెట్ టెస్సెరాక్ట్ మ్యాక్సీ-స్కూటర్ వంటి డిజైన్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది డ్యూయల్ LED-ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఫ్లోటింగ్ DRLలు, పెద్ద TFT టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, వైలెట్ AI కనెక్టివిటీ సూట్, రైడ్ అనలిటిక్స్ వంటి హై-ఎండ్ ఫీచర్లతో కూడిన పర్ఫెక్ట్ స్మార్ట్ స్కూటర్. టెస్రాక్ట్ శక్తివంతమైనది మాత్రమే కాదు.. సూపర్ స్మార్ట్ కూడా. ఇందులో కీలెస్ యాక్సెస్, పార్క్ అసిస్ట్, హిల్ హోల్డ్, మ్యూజిక్ కంట్రోల్, నావిగేషన్, క్రూయిజ్ కంట్రోల్ వంటి సరికొత్త ఫీచర్లను అందించారు.

బ్రేకింగ్, భద్రత
టెస్సెరాక్ట్ డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్‌తో వస్తుంది. ఈ స్కూటర్‌లో 14-అంగుళాల చక్రాలు అమర్చారు. దీనికి రెండు డిస్క్ బ్రేక్‌లను అందించారు. బ్రేకింగ్‌ను అద్భుతంగా చేశారు. అలాగే.. టెస్సెరాక్ట్ లుక్స్ విషయంలో కంపెనీ రాజీపడలేదు. అల్ట్రావయోలెట్ దీనిని డెజర్ట్ సాండ్, సోనిక్ పింక్, స్టీల్త్ బ్లాక్ వంటి అద్భుతమైన రంగు ఎంపికలలో ప్రవేశపెట్టింది. బుకింగ్‌లు త్వరలో ప్రారంభం కానున్నాయి. డెలివరీలు 2026 మొదటి త్రైమాసికం నుంచి ప్రారంభమవుతాయి.