NTV Telugu Site icon

TVS Jupiter 125: టీవీఎస్ జూపిటర్ 125 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే?

Tvs Bike

Tvs Bike

ప్రముఖ బ్రాండెడ్ మోటారు కంపెనీ టీవీఎస్ నుంచి వచ్చిన అన్ని బైకులు యూత్ ను బాగా ఆకట్టుకున్నాయి.. ఈ క్రమంలో తాజాగా మరొక బైక్ ను విడుదల చేశారు.. ఈ బైకు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.. టీవీఎస్ కంపెనీ జూపిటర్ 125 స్కూటర్ ను లాంచ్ చేసింది.. ఎలిగెంట్ రెడ్, మ్యాట్ కాపర్ బ్రాంజ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ రెండూ కొత్తవే.. టీవీఎస్ Jupiter 125 స్కూటర్ ధర రూ. 96,855 ఉంటుందని కంపెనీ వెల్లడించింది..

ఈ బైక్ ప్రత్యేకతలను చూస్తే.. SmartXtrack’తో బ్లూటూత్-కనెక్ట్ చేసిన TFT డిజిటల్ క్లస్టర్‌ను పొందుతుంది. టర్న్-బై-టర్న్ నావిగేషన్ ఫీచర్ కూడా ఉంది. టీవీఎస్ జూపిటర్ 125లో ఆండ్రాయిడ్, iOS ప్లాట్‌ఫారమ్‌లలో లభించే ప్రత్యేకమైన TVS కనెక్ట్ మొబైల్ యాప్‌తో పెయిరింగ్ ఆప్షన్ కలిగి ఉంది. ఈ ఫీచర్ స్మార్ట్‌ఫోన్‌లతో రైడర్‌లకు అనేక రకాల యాక్టివిటీలను అందిస్తుంది.. ఇకపోతే ఈ బైక్ ఫీచర్స్ ను చూస్తే షాక్ అవుతారు..

ఫీచర్స్ ను చూస్తే..టీవీఎస్ మొబైల్ యాప్‌కు కనెక్ట్ చేసుకుని నావిగేషన్, కాల్స్ నోటిఫికేషన్స్ మొదలగు వాటిని పొందవచ్చు. ఇది 124.8cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్‌ను కలిగి ఉంది. 8.18bhp పవర్, 10.5nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఎలిగంట్ రెడ్, మ్యాట్ కాపర్ బ్రాంజ్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. సీటింగ్ కూడా కంఫర్ట్‌గా ఉంటుందని కంపెనీ పేర్కొంది. వెనుక కూర్చునే వారికి బ్యాక్ రెస్ట్‌తో కూడిన సీటింగ్ అందించారు. SmartXonnect టెక్నాలజీ వినియోగదారులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అన్నారు..ఎరుపు, మాట్ కాపర్ బ్రాంజ్, పిలియన్ బ్యాక్ రెస్ట్‌తో ప్రీమియం సీటు TVS జూపిటర్ 125 స్కూటర్ 124.8cc, సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది..ఈ బైక్ కు పోటీగా మరికొన్ని కంపెనీలు ఉన్నాయి..